Renu Desai : నా కూతురికి ఎముక‌లు విర‌గ్గొట్ట‌డం నేర్పిస్తున్నా.. రేణు దేశాయ్ సంచ‌ల‌న కామెంట్స్‌..

January 15, 2026 9:13 PM

Renu Desai : ఏపీ డిప్యూటీ సీఎం, న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె సినిమాల‌కు గుడ్ బై చెప్పినా కూడా సోష‌ల్ మీడియాలో మాత్రం ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గానే ఉంటారు. త‌న‌కు తోచినంత‌లో సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌ను కూడా నిర్వ‌హిస్తుంటారు. ఈమె స్వ‌త‌హాగా జంతు ప్రేమికురాలు. క‌నుక వాటికి ఏమైనా అయితే ఈమె త‌ట్టుకోలేరు. ఇక స‌మాజంలో జ‌రిగే సంఘ‌ట‌న‌ల‌పై కూడా ఈమె స్పందిస్తుంటారు. ఈ క్ర‌మంలోనే తాజాగా కోల్‌క‌తా ఘ‌ట‌న‌పై కూడా రేణు దేశాయ్ కామెంట్స్ చేశారు.

కోల్‌క‌తాలోని ఆర్‌జీ కేర్ మెడిక‌ల్ కాలేజీలో ఓ పీజీ వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, హ‌త్య జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ సంఘ‌ట‌న‌పై యావ‌త్ దేశం క‌దిలింది. నిందితుల‌ను ఉరి తీయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ సంఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే అనేక మంది సెల‌బ్రిటీలు స్పందించారు. తాజాగా రేణు దేశాయ్ కూడా ఇదే సంఘ‌ట‌న‌పై కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఆమె ఏమ‌న్నారంటే..

Renu Desai comments on her daughter about recent incidents
Renu Desai

మీ కొడుకుకు మ‌హిళ‌ల‌ను ఎలా గౌర‌వించాలో నేర్పించండి. ఎందుకంటే నేరు కూడా నా కుమార్తెకు ఎముక‌లు విర‌గ్గొట్ట‌డం నేర్పించ‌బోతున్నాను.. అంటూ రేణు దేశాయ్ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ పెట్టారు. దీంతో ఆమె పోస్ట్ వైర‌ల్‌గా మారింది. కాగా రేణు దేశాయ్ తాను పెట్టిన పోస్ట్‌కు బ్యాక్ గ్రౌండ్‌లో క‌రాటే నేర్పిస్తున్న ఫొటోను యాడ్ చేసింది. దీంతో ఆమె పోస్ట్ నెట్టింట అంద‌రినీ ఆలోచింప‌జేస్తోంది.

కాగా రేణుదేశాయ్ ఇప్ప‌టికే కోల్‌క‌తా ఘ‌ట‌న‌పై స్పందించారు. స‌ద‌రు సంఘ‌ట‌న త‌న‌ను ఎంత‌గానో క‌ల‌చి వేసింద‌న్నారు. స‌మాజంలో మ‌హిళ‌ల‌కు రోజు రోజుకీ భ‌ద్ర‌త‌, ర‌క్ష‌ణ క‌రువ‌వుతుంద‌ని విచారం వ్య‌క్తం చేశారు. అలాంటి మాన‌వ‌మృగాల‌ను క‌ఠినంగా శిక్షించాల్సిందేన‌ని అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now