ఎంతో రుచికరమైన ఫింగర్‌ ఫిష్‌ను ఇలా తయారు చేసుకోండి..!

July 17, 2021 5:10 PM

చేపలతో ఎన్నో రకాల వంటకాలను తయారు చేసుకోచ్చు. ఏ వంటకం చేసినా చేపలు అంటే ఇష్టపడే వారు వాటిని బాగానే తింటారు. ఇక చేపలతో ఫింగర్‌ ఫిష్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

finger fish recipe in telugu

ఫింగర్‌ ఫిష్‌ తయారీకి కావల్సిన పదార్థాలు

  • చేపలు – అర కేజీ
  • బ్రెడ్‌ ముక్కలు – కొన్ని
  • నూనె – వేయించడానికి సరిపడా
  • అల్లం వెల్లుల్లి ముద్ద – రెండు టీస్పూన్లు
  • కారం – కొద్దిగా
  • నిమ్మరసం – రెండు టీస్పూన్లు
  • జీలకర్ర పొడి – టీస్పూన్‌ (వేయించాలి)
  • గుడ్లు – రెండు
  • ఉప్పు – రుచికి తగినంత

తయారు చేసే విధానం

ముళ్లు లేని చేపలను ఎంచుకుని సన్నగా, నిలువుగా ముక్కలు కోయాలి. గుడ్లలోని తెల్లసొనను తీసుకుని గిలక్కొట్టి పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్‌ ముక్కలను పొడి చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలోని చేప ముక్కలు తీసుకుని అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం, నిమ్మరసం, జీలకర్ర పొడి కలిపి మూత పెట్టి ఉంచాలి. గంటయ్యాక బాణలిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టాలి. వేడయ్యాక చేప ముక్కలను గుడ్డు సొనలతో ముంచి బ్రెడ్‌ పొడిలో దొర్లించి వేయాలి. బంగారు వర్ణంలోకి వచ్చాక దించేస్తే వేడి వేడి ఫింగర్‌ ఫిష్‌ సిద్ధమవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment