ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!

August 29, 2023 10:42 AM

ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ ఉంటారు. సంపూర్ణ ఆరోగ్యం పొందాలని అనుకుంటే కచ్చితంగా ఇది మీరు తెలుసుకోవాలి. ఇలా కనుక మీరు చేసినట్లయితే సమస్యలన్నీ పోతాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. శ్రీ హనుమాన్ బడబానల స్తోత్రాన్ని చదువుకుంటే ఎలాంటి సమస్యలైనా కూడా తొలగిపోతాయి. సుఖంగా జీవించొచ్చు. ఏ బాధ ఉండదు. రావణాసురుడి సోదరుడు విభీషణ విరచితం ఈ స్తోత్రం.

హనుమంతుడి శక్తిని స్తుతిస్తూ మొదలుపెట్టి అన్ని రుగ్మతల నుండి అనారోగ్యాల నుండి శత్రువుల నుండి కాపాడాలని వేడుకుంటూ ఇబ్బందులు, భయాలు వంటి వాటి నుండి సర్వారిష్టాల నుండి విముక్తిని చేయాలని కోరుతూ, స్వామి వారి ఆశీస్సులు కలగాలని, దీవించమని ఉంటుంది ఈ స్తోత్రం. ఇది ఎంతో శక్తివంతమైన స్తోత్రం. భక్తిశ్రద్ధలతో పారాయణం చేస్తే అన్ని రకాల సమస్యలు పోతాయి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉండవు. ఈ హనుమత్ బడబానల స్తోత్రాన్ని నిత్యం చదువుకోవచ్చు.

read this lord hanuman stotram daily for health

ఓం అస్య శ్రీ హనుమద్బడబానల స్తోత్ర మహామంత్రస్య శ్రీరామచంద్ర ఋషిః, శ్రీ బడబానల హనుమాన్ దేవతా, మమ సమస్త రోగ ప్రశమనార్థం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీసీతారామచంద్ర ప్రీత్యర్థం హనుమద్బడబానల స్తోత్ర జపమహం కరిష్యే.

ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీమహాహనుమతే ప్రకట పరాక్రమ సకలదిఙ్మండల యశోవితాన ధవళీకృత జగత్త్రితయ వజ్రదేహ, రుద్రావతార, లంకాపురీ దహన, ఉమా అనలమంత్ర ఉదధిబంధన, దశశిరః కృతాంతక, సీతాశ్వాసన, వాయుపుత్ర, అంజనీగర్భసంభూత, శ్రీరామలక్ష్మణానందకర, కపిసైన్యప్రాకార సుగ్రీవ సాహాయ్యకరణ, పర్వతోత్పాటన, కుమార బ్రహ్మచారిన్, గంభీరనాద సర్వపాపగ్రహవారణ, సర్వజ్వరోచ్చాటన, డాకినీ విధ్వంసన, ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహావీరవీరాయ, సర్వదుఃఖనివారణాయ, గ్రహమండల భూతమండల సర్వపిశాచ మండలోచ్చాటన భూతజ్వర ఏకాహికజ్వర ద్వ్యాహికజ్వర త్ర్యాహికజ్వర చాతుర్థికజ్వర సంతాపజ్వర విషమజ్వర తాపజ్వర మాహేశ్వర వైష్ణవ జ్వరాన్ ఛింది ఛింది, యక్ష రాక్షస భూతప్రేతపిశాచాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ,

ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీమహాహనుమతే, ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఆం హాం హాం హాం హాం ఔం సౌం ఏహి ఏహి, ఓం హం ఓం హం ఓం హం ఓం నమో భగవతే శ్రీమహాహనుమతే శ్రవణచక్షుర్భూతానాం శాకినీ డాకినీ విషమ దుష్టానాం సర్వవిషం హర హర ఆకాశ భువనం భేదయ భేదయ ఛేదయ ఛేదయ మారయ మారయ శోషయ శోషయ మోహయ మోహయ జ్వాలయ జ్వాలయ ప్రహారయ ప్రహారయ సకలమాయాం భేదయ భేదయ,

ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీమహాహనుమతే సర్వ గ్రహోచ్చాటన పరబలం క్షోభయ క్షోభయ సకలబంధన మోక్షణం కురు కురు శిరఃశూల గుల్ఫశూల సర్వశూలాన్నిర్మూలయ నిర్మూలయ నాగ పాశ అనంత వాసుకి తక్షక కర్కోటక కాళీయాన్ యక్ష కుల జలగత బిలగత రాత్రించర దివాచర సర్వాన్నిర్విషం కురు కురు స్వాహా, రాజభయ చోరభయ పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరవిద్యాచ్ఛేదయ ఛేదయ స్వమంత్ర స్వయంత్ర స్వవిద్యాః ప్రకటయ ప్రకటయ సర్వారిష్టాన్నాశయ నాశయ సర్వశతౄన్నాశయ నాశయ అసాధ్యం సాధయ సాధయ హుం ఫట్ స్వాహా.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now