Mantram : మంత్రాల‌ను రింగ్ టోన్స్ కింద పెట్టుకుంటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

August 14, 2023 9:42 AM

Mantram : ఇదివరకు రోజుల్లో కేవలం మంత్రాలు వంటి వాటిని చదువుకునేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది. టెక్నాలజీ పెరగడంతో స్మార్ట్ ఫోన్ కి బాగా ప్రతి ఒక్కరు అలవాటు పడిపోయారు. పైగా రింగ్ టోన్స్ కింద మంత్రాల‌ని కూడా పెట్టుకుంటున్నారు. మంత్రం మన మనసు పొరల్లో ఉండే పలు రకాల ఆలోచనల్ని దూరం చేస్తుంది. మహాశక్తివంతమైన మంత్రాలని మన ఋషులు అమోఘ తపశక్తితో భగవద్ ఆవేశంలో పలికిన వాక్యాలే మంత్రాలు. ఎన్నో శక్తివంతమైన మంత్రాలు ఉన్నాయి.

ఇష్టదేవతలని ప్రసన్నం చేసుకోవడమే మంత్ర లక్ష్యం. అయితే పవిత్రమైన మంత్రాలని సెల్ఫోన్ రింగ్ టోన్స్ కింద పెట్టుకోవచ్చా..? పెట్టుకుంటే ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. మంత్రం అనేది ఒక శాసనం. పరమాత్మ సాక్షాత్కారానికి ఆయుధం. ఏ మంత్రం అయినా సరే గురు ఉపదేశం లేనిదే ఫలించదు. మంత్రాలని పురాణాల్లో చెప్పిన విధంగా పాటించాలి.

can we put Mantram as ringtone
Mantram

మంత్రాలని రింగ్ టోన్స్ కింద పెట్టుకోవడం మంచిది కాదు. మహా పాపం. మంత్ర ఉచ్చారణకి కఠోరమైన నియమాలు ఉన్నాయి. ఈ రోజుల్లో చాలామంది రింగ్ టోన్స్ కింద గాయత్రి మంత్రం, మృత్యుంజయ మంత్రం వంటివి పెట్టుకుంటున్నారు. ఇలాంటి చర్యల వల్ల మన ఫలితం పొందడం మాట ఎలా ఉన్నా, మనల్ని అవి పతనం వైపుకు తీసుకెళ్తాయి. మంత్రాలు ఎప్పుడూ పాటలు కాదు. మననం చేయాల్సినది మంత్రం.

మూల మంత్రాలని గురూపదేశం ద్వారా పొందినా మనసులో చేయాలి. మంత్రాలు ఏమీ భజనలు పాటలు కావు. అయితే అలా రింగ్ టోన్స్ కింద పెట్టుకోవాలనుకునే వాళ్ళు అన్నమాచార్య కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు వంటివి పెట్టుకోవచ్చు. వాటిని హాయిగా పాడుకోవచ్చు.

కానీ మంత్రాలని అలా పెట్టుకోకూడదు. రింగ్ టోన్స్ కింద పెట్టుకోవడానికి చాలానే ఉన్నాయి. మనం మంత్రాలనే పెట్టుకోవాల్సిన పనిలేదు. మంత్ర ఉపదేశం ఉన్నవారు మాత్రమే ప్రణవంతో చెయ్యాలి. ఉపదేశం లేని వాళ్ళు ప్రణవ సంహితంగా చేయరాదని శాస్త్రాలు అంటున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment