Kabuli Chana : వీటిని రోజూ ఉడ‌క‌బెట్టి తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

April 5, 2023 8:05 AM

Kabuli Chana : కాబూలీ శనగలలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలు ఉన్నాయి. వారంలో రెండు సార్లు వీటిని తింటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. కాబూలీ శనగల్లో ప్రోటీన్ చాలా సమృద్దిగా ఉంటుంది. అంతే కాకుండా ఇందులో విటమిన్ సి సమృద్ధిగా ఉండ‌డం వ‌ల్ల‌ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడ‌తాయి. అలాగే విటమిన్ బి6, ఫోలేట్, మాంగనీస్, కాల్షియం, ఫైబర్, ఐరన్, పొటాషియం, మెగ్నిషియం సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి.

కాబూలీ శనగల్లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, తక్కువ కార్బొహైడ్రేట్లు ఉంటాయి. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు కాబూలీ శనగలను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కాబూలీ శనగల్లో ప్రోటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉండ‌డం వ‌ల్ల‌ బరువు తగ్గ‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఇవి ఎంత‌గానో తోడ్ప‌డుతాయి. కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేసి తొందరగా ఆకలి లేకుండా చేస్తాయి. దాంతో ఎక్కువ ఆహారం తీసుకోరు. ఫ‌లితంగా బరువు తగ్గుతారు. కాబూలీ శనగల్లో పొటాషియం సమృద్ధిగా ఉండ‌డం వ‌ల్ల‌ గుండె ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడ‌తాయి. దీనికి తోడు విటమిన్ సి, ఫైబర్, విటమిన్ బి6 కూడా గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి.

Kabuli Chana benefits must take them daily
Kabuli Chana

రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిల‌ని తగ్గించడం, రక్తనాళాలలో పేరుకుపోయిన కొవ్వు మొత్తాన్ని తగ్గించడమే కాకుండా, రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి. కాబూలీ శనగలను నానబెట్టి ఉడికించి తింటే మంచిది. కాబూలీ శనగలు విరివిగానే లభ్యం అవుతాయి. కాబట్టి వారంలో రెండు సార్లు తినడానికి ప్రయత్నం చేయండి. దీంతో ఎన్నో విధాలుగా ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అనేక పోష‌కాలు కూడా ల‌భిస్తాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment