Itching On Nose : అప్పుడప్పుడూ సడన్ గా ముక్కుపై దురదపెడుతుంటుంది.. అలా ఎందుకవుతుందో తెలుసా..? కారణం ఇదే..!

March 18, 2023 11:36 AM

Itching On Nose : శరీరం అన్నాక అప్పుడప్పుడూ దురదలు పెడుతూనే ఉంటుంది. కొందరికి చర్మంపై దురదలు వస్తే కొందరికి ఇతర భాగాల్లో దురదలు వస్తుంటాయి. ఇక కొందరికి ఆ దురద తీవ్రత ఎక్కువగా, మరికొందరికి తక్కువగా ఉంటుంది. అయితే చర్మంపై వచ్చే ఏ దురద అయినా అది రావడానికి అనేక కారణాలు ఉంటాయి. దీర్ఘ కాలిక వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు వంటి వాటి వల్ల దురదలు ఎక్కువగా వస్తుంటాయి. కానీ.. సాధారణంగా చాలా మందిలో ఒకే ఒక భాగంపై మాత్రం కామన్‌గా దురద వస్తుంటుంది. అది ఏ భాగం అంటే.. ముక్కు..! అవును, అదే.. చాలా మందికి ముక్కు అప్పుడప్పుడూ దురదగా ఉంటుంది. అయితే అందుకు కారణాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే..

ఎవరికైనా ముక్కు దురద పెడుతుంది అంటే వారికి ఫుడ్‌ అలర్జీ అయిందని తెలుసుకోవాలి. అవును, మీరు విన్నది నిజమే. ఫుడ్‌ అలర్జీ అయితేనే అలా చాలా మందికి ముక్కుపై దురద పెడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఎవరైనా సోయా సాస్‌, చైనీస్‌ ఫుడ్‌, రెడ్‌వైన్‌, చీజ్‌, పిజ్జాలు, బీర్‌, టమాటో ప్యూరీ, ఫిష్‌, షెల్‌ ఫిష్‌ వంటి ఆహారాలను తింటే వారికి ఫుడ్‌ అలర్జీ అవుతుంది. దాంతో కొందరికి ముక్కుపై దురద పెడుతుంది. అయితే అది ఫుడ్‌ అలర్జీ వల్ల వచ్చిన దురద అని చాలా మందికి తెలియదు.

Itching On Nose why does it happens what is the reason
Itching On Nose

ఇక ఆ ఫుడ్‌ తిన్న సమయంలో అలర్జీ వస్తే కొందరిలో తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటంటే.. ఫుడ్‌ అలర్జీ అయిన వారి పెదవులు, కళ్లు వాపులకు గురవుతాయి. వికారంగా ఉంటుంది. వాంతికి వచ్చినట్టు అనిపిస్తుంది. చర్మంపై దద్దుర్లు వస్తాయి. ముక్కుపై కూడా దురద పెడుతుంది. శ్వాస తీసుకోవడంలో సమస్యలు వస్తాయి. కనుక ఈ లక్షణాలు గనక ఎవరికైనా కనిపిస్తుంటే వారికి ఫుడ్‌ అలర్జీ అయిందని తెలుసుకోవాలి. అలా కాకుండా ఏదైనా ఫుడ్‌ తిన్నాక ముక్కు దురద పెట్టినా కూడా ఫుడ్‌ అలర్జీ అయినట్టు గుర్తించాలి. తరువాత అలాంటి ఫుడ్‌ తినకుండా ఉంటే చాలు, దాంతో ఫుడ్‌ అలర్జీ నుంచి తప్పించుకోవచ్చు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇలా ముక్కు దురద పెడుతుంటే చుట్టాలు వస్తారని లేదంటే ఉత్తరాలు అందుతాయని, లేదా ఏదైనా ఆత్మ మాట్లాడుతుందని నమ్ముతారు. ఇవి మూఢ నమ్మకాలే. అసలు నిజం మాత్రం ఫుడ్‌ అలర్జీ. కనుక దాన్ని మరువకండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment