పులితో ఆట‌లా.. నోట్లో చేయి పెట్టాడు.. క‌ర‌క‌రా న‌మిలేసింది.. గుండె ధైర్యం ఉంటేనే చూడండి..

November 6, 2022 1:13 PM

కుక్క‌లు, పిల్లలు, ప‌క్ష‌లు, ఆవులు, గేదెలు.. లాంటి వాటిని పెంచుకుంటే ఫ‌ర్లేదు. వాటితో మ‌న‌కు ఎలాంటి హాని ఉండ‌దు. ఇవి ఎక్క‌డ తార‌స ప‌డ్డా కూడా మ‌న‌కు వీటితో ముప్పు ఉండ‌దు. కానీ క్రూర మృగాలు అలా కాదు. వాటికి వీలైనంత దూరంగా ఉండాల్సిందే. సింహం, చిరుత‌, పులి లాంటి జంతువుల‌ను చూడాల‌ని కోరుకోవాలి. కానీ వాటి ద‌గ్గ‌ర‌కు మాత్రం వెళ్ల‌కూడ‌దు. మ‌నం చిన్న‌త‌నం నుంచి ఈ విష‌యాల‌ను నేర్చుకుంటూనే ఉన్నాం. కానీ కొంద‌రు ఈ విష‌యాలు తెలిసినా క్రూర మృగాల‌తో ఆట‌లు ఆడుతున్నారు. ఫ‌లితంగా ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..?

ఓ జూలో పులి బోనులో ఉండ‌గా.. దాన్ని కొంద‌రు చూస్తున్నారు. అయితే కుక్క‌ను ద‌గ్గ‌ర‌కు పిలిచి దాని త‌ల‌పై నిమిరిన‌ట్లు.. పులితో కూడా అలాగే చేద్దామ‌ని అనుకున్నాడు ఓ వ్య‌క్తి. దీంతో బోను ద‌గ్గ‌ర‌గా వ‌చ్చి అందులో ఉన్న పులిని పిలిచాడు. అది వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి అత‌ని చేతిలో ఉన్న ప‌దార్థాన్ని తినేసింది. అంతేకాదు.. వెంట‌నే అత‌ని చేతిని కూడా అందిపుచ్చుకుని క‌ర‌క‌రా న‌మిలి మింగేసింది. దీంతో ఆ ప్ర‌దేశం అంతా ర‌క్త‌సిక్త‌మైంది. ఈ క్ర‌మంలోనే ఈ మొత్తం సంఘ‌ట‌న‌ను కొంద‌రు వీడియో తీశారు. దాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో కాస్తా వైర‌ల్‌గా మారింది. దీంతో చాలా మంది ఆ వీడియోపై స్పందిస్తున్నారు.

man tried to pet tiger in zoo know what happened next viral video

పులి అంటే క్రూర మృగం. దాంతో ఆట‌లా. కుక్క‌లాగే దాన్ని కూడా పెంపుడు జంతువులా భావించాడు.. చివ‌ర‌కు ఏమైందో చూడండి.. అలాంటి జంతువులు ద‌గ్గ‌ర‌గా ఉన్న‌ప్పుడు కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాలి. వాటిని ద‌గ్గ‌ర‌కు పిలిచి ఫుడ్ పెట్ట‌డం ఏంటి. ద‌య‌చేసి ఇలా ఎవ‌రూ చేయొద్దు.. అంటూ నెటిజ‌న్లు ఈ వీడియోపై ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు.

https://youtu.be/uLuU4GgLy64

అయితే ఈ వీడియో ఎక్క‌డిది.. దీన్ని ఎవ‌రు తీశారు.. అస‌లు ఈ సంఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగింది.. అన్న వివ‌రాలు మాత్రం తెలియ‌రాలేదు. కానీ దీన్ని చూసిన వారంద‌రూ తీవ్రంగా షాక్‌కు గుర‌వుతున్నారు. ఇలాంటి వీడియోను గుండె ధైర్యం ఉన్న‌వారు మాత్ర‌మే చూడాల‌ని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now