Heel Pain : మ‌డ‌మ‌ల నొప్పి ఇబ్బందుల‌కు గురి చేస్తుందా.. ఇలా చేస్తే నొప్పి పూర్తిగా త‌గ్గుతుంది..

September 8, 2022 9:44 AM

Heel Pain : ప్రస్తుతకాలంలో మడమల‌ నొప్పి సాధారణంగా ఎదుర్కొనే సమస్యలలో ఒకటిగా చెప్పవచ్చు. మారుతున్న జీవన శైలి కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు మడమ నొప్పితో బాధపడుతున్నారు. అధిక బరువు, సరైన పోషకాహారం తీసుకోకపోవటం వంటి కారణాలతో మడమల‌ నొప్పి సమస్య ఎదురవుతుంది. మనిషి ప్రతి కదలిక మడమలోని కీలు సహాయంతో జరుగుతుంది. మడమ ఎముకలో మార్పు రావటంవలన మడ‌మ నొప్పితో కదలికలు అనేవి కష్టంగా మారుతుంది.

ఉదయం సమయంలో మంచంపై నుంచి కాలు కింద పెట్టగానే అడుగు తీసి అడుగు వేయలేనంత విపరీతమైన నొప్పితో ఇబ్బంది పడవలసి వస్తుంది. దీని కోసం మందులు వాడడం కన్నా ఇంటి చిట్కాలు ఎంతగానో సహకరిస్తాయి. ఇందు కోసం కేవలం గోరింటాకు, ఆముదం ఉంటే చాలు. గోరింటాకు ఆకులను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. ఈ గోరింటాకు ఆకులను ఆముదంలో వేసి బాగా వేయించాలి. ఈ నూనెను వడకట్టి మడమ నొప్పి ఉన్న ప్రదేశంలో రాసి మసాజ్ చేసుకోవాలి. ఆ తరువాత వేయించిన గోరింటాకును మడమ నొప్పి ఉన్న చోట ఎంత వేడి అయితే పట్టగలరో పట్టులా వేసి గట్టిగా కట్టు కట్టాలి. ఈ విధంగా రెండు, మూడు రోజుల పాటు చేస్తే మడమ నొప్పి తగ్గుముఖం పడుతుంది.

wonderful home remedy for Heel Pain
Heel Pain

మడమలో నొప్పి ఎక్కువగా బాధ పెడుతున్నప్పుడు పది నిమిషాలసేపు ఐస్ ముక్కతో పాదానికి కాపడం పెట్టాలి. ప్రతి రోజూ కొంత సమయం నడవడం ద్వారా రక్త ప్రసరణ బాగా జరిగి మడమల‌ నొప్పి అనేది తగ్గుతుంది. అదేవిధంగా మడమల‌ నొప్పి తగ్గడానికి మరో చిట్కా కూడా  మనకు ఎంతగానో సహకరిస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్ కూడా మడమ నొప్పి తగ్గించడంలో ఎంతగానో సహకరిస్తుంది. బకెట్ గోరువెచ్చని నీటిలో మూడు లేదా నాలుగు టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి మన పాదాల‌ను 15 నిమిషాల పాటు ఉంచడం ద్వారా మడమల‌ నొప్పి అనేది మటుమాయమవుతుంది. ఇలా రోజూ చేస్తే నొప్పి నుంచి బ‌య‌ట ప‌డ‌వచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now