ఊపేస్తాం.. అంటే ఈ విధంగానే ఉంటుంది.. లైగర్ చిత్రంపై తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు..

September 2, 2022 2:09 PM

పూరి జగన్నాథ్‌, విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం లైగర్. హీరోయిన్ అనన్య పాండే లైగర్ చిత్రంతో తెలుగు తెరకు తొలిసారిగా పరిచయం అయింది. ఈ చిత్రంలో మైక్ టైసన్, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. బాక్సింగ్ నేపథ్యంలో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనుకోని రీతిలో అందరి అంచనాలను తారుమారు చేస్తూ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. రిలీజ్‌ అయిన తొలిరోజు నుంచి నెగిటివ్‌ టాక్‌ రావడంతో బాక్సాఫీస్‌ వద్ద భారీ పరాజయాన్ని దక్కించుకుంది. రూ.120 కోట్లకు పైగా ఖర్చుపెట్టిన నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను మిగిల్చింది. ఈ క్రమంలో పూరి జగన్నాథ్‌ మరియు విజయ్‌ దేవరకొండపై కొందరు సినీ ప్రముఖులు తమదైన శైలిలో విమర్శలతో దాడి చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ లైగర్ చిత్రంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మన యాక్షన్‌ని బట్టే ప్రేక్షకుల రియాక్షన్‌ కూడా ఉంటుంది. అతిగా ఎగిరెగిరిపడితే ఇలాంటి అనుభవాలే ఎదుర్కోవలసి వస్తుంది. హీరోలు మా సినిమాను చూడండి అని ప్రమోట్‌ చేయాలే తప్ప, ఊపేస్తాం.. తగలెడతాం అంటూ స్టేట్‌మెంట్లు ఇస్తే ఇదేవిధంగా ప్రేక్షకులు మనల్ని తగలెడతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

tammareddy bharadwaj sensational comments on liger movie

ఇక ఈ సినిమా డిజాస్టర్‌కు కారణాలు ఏమై ఉంటాయి అని తమ్మారెడ్డి భరద్వాజ్ ను ప్రశ్నించగా, ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడను. నేను కూడా పూరి జగన్నాథ్ కు పెద్ద అభిమానిని. కానీ లైగర్‌ ట్రైలర్‌ చూసినప్పుడే నాకు చిత్రం చూడలనిపించలేదు. భవిష్యత్తులో కుదిరితే సినిమా చూస్తా అని తమ్మారెడ్డి భరద్వాజ వెల్లడించారు. బాయ్‌ కాట్‌ ట్రెండ్‌పై భరద్వాజ రియాక్ట్ అవుతూ, ఒక సినిమా వచ్చిందంటే చాలు .. నూటికి 95 శాతం తమ సోషల్ మీడియా లైకుల కోసం ఇష్టం వచ్చినట్లు వార్తలు క్రియేట్ చేస్తూ ప్రచారం చేస్తారు. ఇలాంటి వార్తలను అసలు పట్టించుకోను అవసరమే లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో సక్సెస్‌ అనేది కేవలం ఐదు శాతమే ఉంది. 95 శాతం సినిమాలు ఆడటం లేదన్నారు. ఎంతో మంది నిర్మాతలు పూట గడవని స్థితిలో ఇండస్ట్రీలో ఇబ్బందులు పడుతున్నారని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment