Battre Storie Electric Scooter : మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూట‌ర్‌.. ఏకంగా 132 కిలోమీట‌ర్ల మైలేజ్‌..!

June 12, 2022 10:28 PM

Battre Storie Electric Scooter : ప్ర‌స్తుత త‌రుణంలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు రోజు రోజుకీ ఎలా పెరిగిపోతున్నాయో అంద‌రికీ తెలిసిందే. వీటి ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో చాలా మంది ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను కొనుగోలు చేసి వాడేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ల‌తో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహ‌నాలు చాలా ఎక్కువ మైలేజ్‌ని అందించ‌డ‌మే కాకుండా.. వీటిని నిర్వ‌హించ‌డం కూడా సుల‌భ‌మే. క‌నుక‌నే ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను కొనేందుకు చాలా మంది ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఇక అలాంటి వారి కోస‌మే మార్కెట్‌లో ఇప్ప‌టికే ఎన్నో ర‌కాల కంపెనీల‌కు చెందిన ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా ఈ మార్కెట్‌లోకి ఇంకో కంపెనీ రంగ ప్ర‌వేశం చేసింది.

బ్యాట్‌రీ స్టోరీకి చెందిన నూత‌న ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను ఆ కంపెనీ తాజాగా భార‌త్‌లో లాంచ్ చేసింది. దీని ధ‌ర రూ.89వేలు. కాగా ఈ స్కూట‌ర్ చాలా మైలేజ్‌ని అందిస్తుంద‌ని కంపెనీ ప్ర‌క‌టించింది. దీన్ని ఒక్కసారి చార్జింగ్ చేస్తే ఏకంగా 132 కిలోమీట‌ర్ల మేర ప్ర‌యాణించ‌వ‌చ్చు. ప్ర‌స్తుత త‌రుణంలో మార్కెట్‌లో చాలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు అందుబాటులో ఉన్నాయి. కానీ మైలేజ్ త‌క్కువ‌గానే వ‌స్తుంది. అయితే ఈ స్కూట‌ర్ ద్వారా అధిక మైలేజీని పొంద‌వ‌చ్చ‌ని కంపెనీ చెబుతోంది.

Battre Storie Electric Scooter launched in India
Battre Storie Electric Scooter

ఇందులో 3.1 కిలోవాట్ అవ‌ర్ సామ‌ర్థ్యం క‌లిగిన బ్యాట‌రీని ఏర్పాటు చేశారు. టీవీఎస్ కంపెనీకి చెందిన లూకాస్ ఎల‌క్ట్రిక్ మోటార్‌ను ఇందులో అమ‌ర్చారు. అయితే ఈ స్కూట‌ర్‌కు చెందిన పూర్తి వివ‌రాల‌ను ఇంకా వెల్లడించ‌లేదు. కానీ దీన్ని త్వ‌ర‌లోనే విక్ర‌యించ‌నున్నారు. క‌నుక అప్పుడు పూర్తి వివ‌రాలు తెలుస్తాయి. ఇక ఇందులో అత్యంత అధునాత‌న ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నార‌ని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment