IPL 2022 : ఐపీఎల్ మ్యాచ్‌లో షారూక్ కుమార్తె సుహానా ఖాన్ అందాల ఆర‌బోత‌.. వీడియో..!

April 2, 2022 11:33 AM

IPL 2022 : ప్ర‌స్తుతం ఐపీఎల్ హంగామా న‌డుస్తోంది. క‌రోనా కాస్త త‌గ్గ‌డంతో స్టేడియంల‌లోకి ప్రేక్ష‌కుల‌ని కూడా అనుమ‌తిస్తున్నారు. శుక్ర‌వారం ముంబైలోని వాంఖెడె స్టేడియంలో కోల్‌కతా-పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని 14.3 ఓవర్లలోనే చేధించింది. లక్ష్య చేధనలో కోల్‌కతా మొదట తడబడినప్పటికీ రసెల్ మెరుపు ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌లో నెగ్గింది. రసెల్ 31 బంతుల్లో 8 సిక్స్‌లు, 2 ఫోర్లతో 70 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

IPL 2022 Shah Rukh Khan daughter Suhana Khan viewed match
IPL 2022

శ్రేయాస్ అయ్యర్ 25 (15), సామ్ బిల్లింగ్స్ (23) పరుగులు చేశారు. అజింక్యా రహానే, వెంకటేశ్ అయ్యర్ తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌కి మద్దతుగా షారూక్‌ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్, లైగ‌ర్ బ్యూటీ అనన్య పాండే తెగ హ‌డావిడి చేశారు. పంజాబ్ కింగ్స్ పవర్ హిట్టర్ షారుక్ ఖాన్ అవుట్ కావ‌డంతో సుహానా ఖాన్, అనన్య పాండే ఇద్దరూ సంతోషంగా కనిపించారు. చప్పట్లు కొడుతూ, ఎగురుతూ సందడి చేశారు. కాగా ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. షారుక్ ఖాన్.. ఐదు బంతులు ఆడి సున్నాకి ఔట్ అయ్యాడు. అతడిని టిమ్ సౌథీ క్యాచ్ అవుట్ చేశాడు.

https://twitter.com/srkian_abhijeet/status/1509910804212367361

వాంఖెడె స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ బ్యాట్స్‌మెన్.. తొలి నుంచే తడబాటుకు గురై వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. పంజాబ్ టీమ్‌లో రాజపక్స మాత్రమే రాణించాడు. 9 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లతో విధ్వంసకర బ్యాటింగ్‌ చేసి 31 పరుగులు చేశాడు. రబడ 16 బంతుల్లో 25 పరుగులు చేశాడు. లివింగ్‌స్టోన్ (19), ధావన్ (16) కొట్టారు. మొత్తంగా 18 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయిన పంజాబ్ టీమ్.. 137 పరుగులు చేసి 138 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా ముందు ఉంచింది. ర‌సెల్ విజృంభ‌ణ‌తో ఈ ల‌క్ష్యాన్ని సునాయాసంగా ఛేదించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now