Samsung : ఫిబ్ర‌వ‌రి 9వ తేదీన శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌.. ఎస్‌22 సిరీస్ ఫోన్లు రిలీజ్ అయ్యే చాన్స్‌..!

January 26, 2022 1:05 PM

Samsung : ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ ఎట్ట‌కేల‌కు త‌న గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. ఫిబ్ర‌వ‌రి 9వ తేదీన ఈ ఈవెంట్‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగా గెలాక్సీ ఎస్22 సిరీస్ ఫోన్ల‌ను, కొత్త ట్యాబ్‌ల‌ను శాంసంగ్ విడుద‌ల చేస్తుంద‌ని తెలుస్తోంది.

Samsung galaxy unpacked 2022 event on February 9th

ఈ ఈవెంట్‌లో గెలాక్సీ ఎస్‌22, ఎస్‌22 ప్ల‌స్‌, ఎస్‌22 అల్ట్రా స్మార్ట్ ఫోన్ల‌తోపాటు ట్యాబ్ ఎస్‌8 ప్ల‌స్‌, ట్యాబ్ ఎస్‌8 అల్ట్రా ట్యాబ్‌ల‌ను శాంసంగ్ విడుద‌ల చేస్తుంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే 30 సెక‌న్ల నిడివి ఉన్న ఓ ట్రైల‌ర్‌ను కూడా శాంసంగ్ లాంచ్ చేసింది. దీన్ని బ‌ట్టి చూస్తే కొత్త మోడ‌ల్స్‌లో ఫీచర్లు అదిరిపోతాయ‌ని తెలుస్తోంది.

గెలాక్సీ ఎస్‌22 సిరీస్ ఫోన్ల‌లో స్నాప్‌డ్రాగ‌న్ 8వ జ‌న‌రేష‌న్ లేదా ఆక్టాకోర్ శాంసంగ్ ఎగ్జినోస్ 2200 ప్రాసెస‌ర్‌ను అందిస్తార‌ని తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్లు 8/12జీబీ ర్యామ్‌, 128/256/512 జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్ల‌తో విడుద‌ల‌వుతాయ‌ని తెలుస్తోంది.

ఇక కొత్త ట్యాబ్‌ల‌లోనూ దాదాపుగా ఇవే ఫీచ‌ర్ల‌ను అందివ్వ‌నున్నార‌ని తెలుస్తోంది. వాటిని 11, 12.7, 14.6 ఇంచుల మోడ‌ల్స్‌లో విడుద‌ల చేస్తార‌ని స‌మాచారం.

శాంసంగ్ త‌న గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2022 ఈవెంట్‌ను ఫిబ్ర‌వ‌రి 9వ తేదీన భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 8.30 గంట‌ల‌కు నిర్వ‌హించ‌నుంది. కార్య‌క్ర‌మాన్ని యూట్యూబ్‌లో లేదా శాంసంగ్ అధికారిక సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now