Samantha : స్పెష‌ల్ సాంగ్ చేయ‌డంపై స్ట‌న్నింగ్ కామెంట్స్ చేసిన స‌మంత‌..!

December 21, 2021 9:18 PM

Samantha : నాగ చైత‌న్య నుండి విడిపోయిన త‌ర్వాత స‌మంత త‌గ్గేదే లే అంటోంది. ఒక ర‌కంగా స‌మంత‌-చైతూ విడిపోవ‌డానికి కార‌ణం కూడా స‌మంత ఎంచుకునే పాత్ర‌లు అని తెలుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్‌ 2 లో బోల్డ్ యాక్టింగ్, పుష్ప‌లో మాస్ సాంగ్ చేయ‌డం.. విడాకుల‌కి ముఖ్య కార‌ణాలు అయి ఉంటాయని కొంద‌రు ఆరోపిస్తున్నారు. పుష్ప సాంగ్‌లో స‌మంత గ్లామ‌ర్ షోను ప్ర‌ద‌ర్శిస్తూ అంద‌రి మ‌తుతూ పోగొట్టింది.

Samantha stunning comments on her special song pushpa movie

‘పుష్ప’ స్పెషల్‌ సాంగ్‌పై పాజిటివిటీతోపాటు నెగెటివిటీ కూడా వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే సమంత హాట్‌ కామెంట్స్‌ చేసింది. పుష్ప స్పెషల్‌ సాంగ్‌కు సంబంధించిన ఓ ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘నేను బాగా చేశాను, చెడ్డగా కూడా చేశాను. కొన్ని సందర్భాల్లో సీరియస్‌ అయ్యాను. నవ్వించాను కూడా. ఇలా నేను తీసుకునే ప్రతి నిర్ణయంలో రాణించడానికి శ్రమిస్తున్నాను.

నేను నాకిచ్చిన బాధ్యతను సమర్థంగా పోషించడానికి 100 శాతం కష్టపడతాను. కానీ సెక్సీ (అందం)గా కనిపించాలంటే మాత్రం అంతకుమించి కష్టపడాలి. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’ అని ఈ సందర్భంగా ‘ఊ అంటావా మావా.. ఊహు అంటావా’ పాట హ్యాష్‌ ట్యాగ్‌ను జోడించింది సామ్‌. కాగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ మూవీ కోసం స‌మంత ఐటమ్‌ భామ‌గా మారిన విష‌యం తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now