Balakrishna : బాల‌కృష్ణ‌తో క‌లిసిన బ‌న్నీ.. త‌గ్గేదే లే..

December 21, 2021 8:11 PM

Balakrishna : ఈ మ‌ధ్య అల్లు ఫ్యామిలీతో బాల‌కృష్ణ చేస్తున్న సంద‌డి మాములుగా లేదు. ఇటీవ‌ల బాల‌కృష్ణ అఖండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక‌కి అల్లు అర్జున్ ఛీఫ్ గెస్ట్‌గా హాజరు కాగా ఆ కార్య‌క్ర‌మంలో బ‌న్నీ మాట్లాడుతూ.. త‌మ‌ అనుబంధం ఏనాటిదో అని వ్యాఖ్యానించారు. సీనియర్ ఎన్టీఆర్‌తో తన తాత అల్లు రామలింగయ్యకు ఎంతో సాన్నిహిత్యం ఉండేదని, ఎన్టీఆర్ కిచెన్ లోకి అల్లు రామలింగయ్య నేరుగా వెళ్లిపోయేవారని తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ సీనియారిటీలో బాలయ్య నాకు తండ్రిలాంటి వారని తెలిపారు అల్లు అర్జున్‌.

Balakrishna unstoppable show next guest is allu arjun

తాజాగా బ‌న్నీ.. బాల‌య్య అన్‌స్టాపబుల్ షోలో సందడి చేశాడు. దీనికి సంబంధించి అఫిషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఇది సినిమా రిలీజ్‌కి ముందే షూటింగ్ జ‌రుపుకుంది. వాస్తవానికి ‘అన్‌స్టాపబుల్’ నెక్స్ట్ ఎపిసోడ్‌లో రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఉండవలసి ఉంది. కానీ ‘పుష్ప’ టీమ్ కారణంగా మాస్ మహారాజ ఎపిసోడ్ ఈ సంవత్సరం చివరి ఎపిసోడ్ కానుందని, మరో వారానికి వాయిదా పడిందని సమాచారం.

ఏదేమైనా “అన్‌స్టాపబుల్” షోలో ఆశ్చర్యకరంగా రాజమౌళి, రవితేజ, అల్లు అర్జున్ వంటి ఊహించని అతిథులను తెరపైకి తీసుకు వస్తూ ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నారు. రాజ‌మౌళితో కూడా బాల‌య్య తెగ సంద‌డి చేయ‌గా, అల్లు అర్జున్ – బాల‌కృష్ణ టాక్ షోలో ఏయే విష‌యాల గురించి మాట్లాడుకుంటారా అని అంద‌రూ ఆస‌క్తిక‌రంగా ఎదురు చూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now