Sriram Bigg Boss : క‌ప్ గెల‌వ‌కున్నా మ‌న‌సులు గెలుచుకున్న శ్రీరామ‌చంద్ర ఎంత సంపాదించాడో తెలుసా ?

December 21, 2021 6:50 PM

Sriram Bigg Boss : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 కార్య‌క్ర‌మం ఎట్ట‌కేల‌కు ముగిసింది. ఆదివారం సాయంత్రం జరిగిన గ్రాండ్ ఫినాలేలో వీజే సన్నీ టైటిల్‌ను కైవసం కైవసం చేసుకున్నాడు. ఉద్వేగభరిత, ఉత్కంఠభరితమైన క్షణాల మధ్య హోస్ట్ నాగార్జున ఈ విషయాన్ని ప్రకటించారు. షణ్ముఖ్ రెండో స్థానంలో నిలవగా, మాజీ ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర ఈ సీజన్‌లో మూడో స్థానంలో నిలిచాడు.

Sriram Bigg Boss know how much he earned in the show

రెండో స్థానంలో చోటు దక్కించుకుంటాడనుకున్న శ్రీరామ్‌ మూడో స్థానంలో నిలవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే బిగ్‌బాస్‌ హౌస్‌లో 15 వారాలపాటు ఉన్న శ్రీరామ్‌ ఎంత గెలుచుకున్నాడన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారమైతే అతను వారానికి 2 నుంచి 2.50 లక్షల రూపాయలు అందుకున్నాడట. అంటే బిగ్‌బాస్‌ షో ద్వారా అతడు మొత్తంగా రూ.35 లక్షలు వెనకేసినట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మ‌ం 19 మంది సభ్యులతో ప్రారంభం కాగా ఇందులో స‌రయు, ఉమా దేవి, లహరి శేరి, శ్వేతా వర్మ, ప్రియా, ప్రియాంక సింగ్, నటరాజ్ మాస్టర్, హమీద, విశ్వ, రవి, లోబో, అనీ మాస్టర్‌, జెస్సీ, ఆర్జే కాజల్, సన్నీ, షణ్ముఖ్, సిరి, శ్రీరామ చంద్ర కంటెస్టెంట్స్ గా హౌజ్ లోకి అడుగు పెట్టారు. ఇక గ్రాండ్ ఫినాలేలో రాజమౌళి, సుకుమార్, నాగ చైతన్య, నాని, కృతి శెట్టి, అలియా భట్, రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, రష్మిక మందన్న వంటి చాలా మంది స్టార్స్ పాల్గొని తెగ సంద‌డి చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now