Hamsa Nandini : షాకింగ్‌.. హీరోయిన్ హంసా నందినికి బ్రెస్ట్ క్యాన్స‌ర్‌.. ఎలా మారిపోయిందో చూడండి..

December 20, 2021 1:55 PM

Hamsa Nandini : హీరోయిన్ హంసా నందిని షాకింగ్ న్యూస్ చెప్పారు. త‌న ఆరోగ్యానికి సంబంధించి ఓ పిడుగు లాంటి వార్త చెప్పారు. త‌న‌కు వైద్య ప‌రీక్ష‌ల్లో క్యాన్స‌ర్ ఉన్న‌ట్లు తేలింద‌ని చెప్పారు. దీంతో ఫ్యాన్స్ అంద‌రూ ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌వుతున్నారు.

Hamsa Nandini got cancer worrying news for fans

హంసా నందిని తాజాగా ఓ సోష‌ల్ మీడియా పోస్ట్ పెట్టారు. అందులో సుదీర్ఘ‌మైన సందేశం ఉంది. దాంట్లో త‌న‌కు క్యాన్స‌ర్ ఉన్న‌ట్లు చెప్పుకొచ్చారు. త‌న‌కు హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్ పాజిటివ్ (BRCA 1) ఉంద‌ని చెప్పారు. త‌న‌కు 70 శాతం బ్రెస్ట్, 40 శాతం అండాశ‌య క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని గ‌తంలోనే చెప్పార‌ని.. ఈ క్ర‌మంలోనే త‌న‌కు బ్రెస్ట్ క్యాన్స‌ర్ వ‌చ్చింద‌ని తెలిపారు. అయితే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేందుకు స‌ర్జ‌రీలు చేయించుకోవాల్సి ఉంటుంద‌ని తెలిపారు. కీమోథెర‌పీ, లుమ్పెక్టమి చేయించుకోవాల్సి ఉంటుంద‌న్నారు.

ఇప్పటికే కీమోథెరఫీ 9 సార్లు చేయించుకున్నానని, ఇంకా 7 సార్లు చేయించుకోవాల్సి ఉంద‌ని తెలిపారు. అయితే క్యాన్స‌న్ వ‌చ్చినా తానేమీ కుంగిపోన‌ని, తాను పోరాటం చేస్తాన‌ని తెలిపారు. ఈ స‌వాల్‌ను తాను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొని తిరిగి వెండితెర‌పై క‌నిపిస్తాన‌ని ధీమా వ్య‌క్తం చేశారు. కాగా హంసా నందిని వ‌య‌స్సు ప్ర‌స్తుతం 37 ఏళ్లు కాగా.. ఈమె గ‌త కొంత కాలంగా ఇండ‌స్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ప్ర‌స్తుతం త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి ఈమె పూణెలో ఉంటోంది.

4 నెల‌ల కింద‌ట హంసా నందిని త‌న బ్రెస్ట్‌ళో చిన్న గ‌డ్డ‌ను గుర్తించింది. అప్పుడే అనుమానం వ‌చ్చింద‌ని, అది క్యాన్స‌ర్ అయి ఉంటుంద‌ని తెలిపింది. కాగా 18 ఏళ్ల కింద‌టే త‌న త‌ల్లి బ్రెస్ట్ క్యాన్స‌ర్‌తో మ‌ర‌ణించింది. దీంతో వంశ పారంప‌ర్యంగా ఈ వ్యాధి సోకే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి కాబ‌ట్టి త‌న‌కూ ఈ వ్యాధి వ‌చ్చింద‌ని చెప్పింది.

అయితే తాను కొంత కాలం నుంచి సోష‌ల్ మీడియాకు, ఇండ‌స్ట్రీకి దూరంగా ఉంటుండ‌డంతో అంద‌రూ త‌న‌కు ఏమైందోన‌ని ఆందోళ‌న చెందుతున్నార‌ని.. త‌న ప‌ట్ల చూపించిన ప్రేమ‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాన‌ని చెప్పింది. క్యాన్స‌ర్ అంటే తాను భ‌య‌ప‌డేది లేద‌ని, నిపుణులైన వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స తీసుకుంటున్నాన‌ని వివరించింది. క్యాన్స‌ర్‌ను జ‌యిస్తాన‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని తెలిపింది.

కాగా హంసా నందిని 2004లో విడుద‌లైన ఒక్క‌ట‌వుదాం అనే మూవీతో తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయింది. 2018లో విడుద‌లైన గోపీచంద్ పంతం మూవీలో ఆమె చివ‌రిసారిగా క‌నిపించింది. ఆమె అనేక సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేయ‌డంతోపాటు ప‌లు ఐట‌మ్ సాంగ్‌ల‌లోనూ న‌టించి మెప్పించింది. ఏది ఏమైనా హంసా నందినికి క్యాన్స‌ర్‌కు అని తెలియ‌డంతో అంద‌రూ షాక్‌కు గుర‌వుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment