VJ Sunny : బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్న విజేత స‌న్నీ అస‌లు పేరు ఏంటో తెలుసా?

December 20, 2021 8:32 AM

VJ Sunny : బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మం ఎట్ట‌కేల‌కు అట్ట‌హాసంగా ముగిసింది. ప‌లువురు స్టార్స్ న‌డుమ ఎంతో సందడిగా సాగిన ఈ షోలో బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ తెగ సంద‌డి చేశారు. అనేక ట్విస్ట్‌ల మ‌ధ్య బిగ్ బాస్ సీజ‌న్ 5 విజేత‌గా స‌న్నీని ప్ర‌క‌టించారు. విజేతగా అవతరించిన సన్నీకి కింగ్‌ నాగార్జున బిగ్‌బాస్‌ ట్రోఫీని బహుకరించారు. అంతేకాక రూ.50 లక్షల చెక్‌ను అందజేశారు.

VJ Sunny lifted bigg boss 5 telugu trophy do you know his real name

దీంతోపాటు సువర్ణ భూమి ఇన్‌ఫ్రాస్టక్చర్‌ నుంచి షాద్‌నగర్‌లో రూ.25 లక్షల విలువ చేసే 300 చదరపు గజాల భూమిని విన్నర్‌ సన్నీ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. టీవీఎస్‌ బైక్‌ కూడా గెలుచుకున్నాడని ప్రకటించారు. అయితే అమ్మ అడిగిన మొట్టమొదటి బహుమతి బిగ్‌బాస్‌ ట్రోఫీ అంటూ.. దాన్ని ఆమె చేతుల్లో పెట్టి సంతృప్తి చెందాడు.

సీజ‌న్ 5 విజేత‌గా నిలిచిన స‌న్నీకి సంబంధించి అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. అత‌ని అస‌లు పేరు అరుణ్ రెడ్డి. వీజేగా అల‌రించిన స‌న్నీ ఎట్ట‌కేల‌కు సీజ‌న్ 5 విజేత‌గా నిలిచి అంద‌రి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. హౌజ్‌లో ఎంత కొట్టుకున్నా కూడా మేమంద‌రం ఒక‌టే అని హుందాగా మాట్లాడి అంద‌రి చేత శ‌భాష్ అనిపించుకుంటున్నాడు. స‌న్నీకి ఇక సినిమా ఆఫ‌ర్స్ భారీగా రావ‌డం ఖాయంగా కనిపిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now