Pushpa Spiderman : బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ ప‌డుతున్న పుష్ప‌, స్పైడ‌ర్ మ్యాన్..!

December 19, 2021 7:27 PM

Pushpa Spiderman : బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆసక్తికర పోటీ సాగుతోంది. ఈ వారం పుష్ప‌, స్పైడ‌ర్ మ్యాన్ నో వే హోమ్ చిత్రాలు విడుద‌ల కాగా, ఈ రెండు చిత్రాలు నువ్వా నేనా అన్న‌ట్టుగా పోటీ ప‌డుతున్నాయి. తెలుగు ప్రేక్ష‌కులు హాలీవుడ్ చిత్రం స్పైడ‌ర్ మ్యాన్ నో వే హోమ్ మూవీని కూడా చ‌క్క‌గా ఆద‌రిస్తున్నారు. స్పైడర్ మ్యాన్.. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు చాలామంది ఇష్టపడే ఓ ఫిక్షనల్ క్యారెక్టర్. అందుకే స్పైడర్ మ్యాన్ సినిమాను ఎంతమంది ఎన్నిరకాలుగా తెరకెక్కించినా ప్రేక్షకులు వాటిని ఆదరిస్తూనే ఉన్నారు.

Pushpa Spiderman movies are competing with each one at box office

మూడో భాగమైన ‘స్పైడర్ మ్యాన్ నో వే హోమ్‌’ వాటికి మించిన రికార్డ్ స్థాయి కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఇది పుష్పకు గట్టిపోటీ ఇస్తోంది. భారీ హైప్‌తో డిసెంబర్‌ 16న విడుదలైంది స్పైడర్‌ మ్యాన్‌: నో వే హోమ్‌. టామ్‌ హాలండ్‌ స్పైడర్ మ్యాన్ గా టైటిల్ రోల్ చేసిన ఈ మూవీ.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని సక్సెస్ సాధించి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రిలీజ్ అయిన 3 రోజుల్లోనే స్పైడీ మూవీ.. ఇండియాలో రూ.100 కోట్ల మార్కును దాటేసింది.

స్పైడర్‌ మ్యాన్‌: నో వే హోమ్ ఇండియాలో గురువారం (డిసెంబర్‌ 16) ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో 3,264 స్క్రీన్‌లలో రిలీజైంది. ఈ చిత్రం శుక్రవారం మాత్రం అంతగా కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఎందుకంటే అదే రోజున (డిసెంబర్‌ 17) ఐకానిక్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సినిమా ‘పుష్ప: ది రైజ్‌’ విడుదలే కారణం. అత్యధిక జనం పుష్పకు వెళ్లడంతో స్పైడర్‌ మ్యాన్‌ చిత్రానికి వసూళ్లు తగ్గాయి. పుష్ప సినిమాతో గట్టి పోటీ ఎదుర్కొన్న స్పైడీ శుక్రవారం రూ. 20.37 కోట్లు వసూలు చేయగా.. శనివారం మాత్రం రూ. 26.10 కోట్లు రాబట్టాడు. ఏదేమైనా ఈ రెండు గ‌ట్టిగా పోటీ ప‌డుతుండ‌డం విశేషం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now