Manchu Lakshmi : మంచు లక్ష్మి చేతులు, కాళ్లకు గాయాలు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే..?

December 19, 2021 3:48 PM

Manchu Lakshmi : మంచు మోహన్‌ బాబు కుమార్తె మంచు లక్ష్మి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. సోషల్‌ మీడియా వేదికగా ఈమె చేసే పోస్టులకు నెటిజన్లు ఎప్పుడూ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంటారు. తాజాగా ఈమె చేసిన పనికి నెటిజన్లు మరోసారి ఈమెపై విమర్శలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

Manchu Lakshmi posted her injured photos netizen angry on her

మంచు లక్ష్మి తాజాగా తన చేతులు, కాళ్లకు గాయాలు అయిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఆమె చేతి వేళ్లపై, కాళ్లపై కోసుకుపోయినట్లు గాయాలు ఉన్నాయి. ఆమె వేసుకున్న జీన్‌ ప్యాంట్‌ కూడా చిరిగిపోయి గాయాలు బయటకు కనిపిస్తున్నాయి. దీంతో ఆమె పోస్ట్‌ చేసిన ఫొటోలను చూసిన నెటిజన్లు ఒక్కసారిగా ఖంగారు పడ్డారు.

మంచు లక్ష్మికి నిజంగానే గాయాలు అయ్యాయా.. అని ఆరాలు తీయడం మొదలు పెట్టారు. ఆమెకు యాక్సిడెంట్‌ అయి ఉంటుందని, అందుకనే గాయాలు అయి ఉంటాయని నెటిజన్లు భావించారు. ఆమె పరిస్థితి పట్ల విచారం వ్యక్తం చేశారు. అయితే ఆమె తీరా విషయం చెప్పాక.. ఆమెకు సానుభూతి తెలిపిన వారే ఆమెను తీవ్రంగా విమర్శించడం మొదలు పెట్టారు.

Manchu Lakshmi posted her injured photos netizen angry on her

ఆ గాయాలు నిజంగా అయినవి కావట. ఓ షూటింగ్‌ లో అయినవట. అందులో భాగంగానే గాయాలు అయినట్లు మేకప్‌ వేసుకున్నానని ఆమె ీ సందర్బంగా అసలు విషయం చెప్పేసింది. దీంతో నెటిజన్లు మళ్లీ షాక్‌ కు గురయ్యారు. ఈ క్రమంలో వారు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది పద్ధతేనా..? ఏ విషయంలో జోక్‌ చేయాలో తెలియదా..? ఇలా ఎవరైనా జోక్‌ చేస్తారా..? అంటూ మండిపడుతున్నారు.

అయితే ఇటీవలే ఆమె ఓ ట్వీట్‌ చేసి వివాదంలో చిక్కుకుంది. కన్నడ స్టార్‌ నటుడు పునీత్‌ రాజ్‌ కుమార్‌ ఇంకా మరణించకముందే ఆయన మృతికి సానుభూతి తెలుపుతున్నానని ఆమె ట్వీట్‌ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్లీ ఈ ఫొటోలతో మంచు లక్ష్మి మరోమారు వార్తల్లో నిలిచింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now