Adivi Sesh : వ‌చ్చే ఏడాది పెళ్లి చేసుకుంటానంటున్న యంగ్ హీరో..!

December 18, 2021 7:26 PM

Adivi Sesh : టాలెంటెడ్ హీరో అడివి శేష్ హిట్, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తాజాగా మేజ‌ర్, హిట్ 2 అనే సినిమాలు చేస్తున్నాడు. హిట్ 2లో అడివి శేష్ కు జోడిగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్‌గా విడుదలైన ఫస్ట్ గ్లింప్ల్స్ లో అడివి శేష్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. అడివి శేష్ కు సంబంధించిన ఎమోషనల్ సన్నివేశాలతో వదిలిన గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

Adivi Sesh says he will marry next year

మ‌రోవైపు అడివి శేష్.. మేజర్ సినిమా చేస్తున్నాడు. డైరెక్టర్ శశికిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శోభితా ధూళిపాళ్ల, సాయి మంజ్రేకర్ నటిస్తున్నారు. 75 లొకేషన్లలో షూటింగ్ చేయగా.. ఎనిమిది సెట్లు ప్రత్యేకంగా నిర్మించారు. ఇందులో 26/11 దాడుల్లో ఆయన చూపించిన తెగువ, ధైర్య సాహసాలు మాత్రమే కాకుండా ఆయన జీవితంలోని ప్రతి ఒక్క ఘటననూ చూపించబోతోన్నారు.

ఈ కుర్ర హీరో ఇటీవలే 36వ పడిలోకి అడుగు పెట్టాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. ఇంట్లో ఎప్పటినుంచో పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు. నేనే ఎదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నా అన్నారు. అలాగే కొన్నాళ్లు గట్టిగా చెప్పారు .. ఆ తరువాత తిట్టారు .. ఇక వీడికి చెప్పడం వేస్ట్ అని వదిలేశారు. కానీ నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది. నిజం చెప్పాలంటే నాకు పెళ్లిపై గాలి మళ్లింది అన్నారు శేష్. వచ్చే ఏడాది అడవి శేష్ పెళ్లి అయ్యే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now