Pushpa Movie : తండ్రి సినిమా రిలీజ్ సంద‌ర్భంగా స్కెచ్‌తో ఇంప్రెస్ చేసిన అయాన్..!

December 17, 2021 6:08 PM

Pushpa Movie : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం పుష్ప. డిసెంబ‌ర్ 17న విడుద‌లైన ఈ చిత్రం అంద‌రి ప్ర‌శంస‌లను అందుకుంటోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ న‌ట‌న‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. తోటి పరిశ్రమ ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆయన తనయుడు అల్లు అయాన్ చేసిన స్పెషల్ ట్వీట్ ఈ రోజును మరింత స్పెషల్ గా చేసింది.

Pushpa Movie allu arjun son allu ayaan made a sketch viral in social media

అయాన్ ఒక చిన్న పెన్సిల్ స్కెచ్ తయారు చేసి ‘పుష్ప విడుదల (17-12-2021)… ఆల్ ది బెస్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్’ అంటూ ‘పుష్ప’రాజ్ ను విష్ చేయడం విశేషం. ఈ స్కెచ్‌ని బన్నీ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ “నా చిన్ని బాబూ థాంక్యూ… నా అయాన్ ఐ లవ్ యూ… నువ్వు ఈ కార్డ్‌తో నా ఉదయాన్ని మరింత ప్రత్యేకం చేశావు” అంటూ కొడుకుపై ప్రేమను కురిపిస్తూ పొంగిపోయాడు అల్లు అర్జున్.

Pushpa Movie allu arjun son allu ayaan made a sketch viral in social media

అయాన్ టాలెంట్ ను చూసి ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా, ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ ఇతర కీలక పాత్రలు పోషించారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో పుష్ప పాన్ ఇండియా లెవల్‌లో విడుదలైంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now