Pushpa 2 The Rule : పుష్ప రెండో పార్ట్ టైటిల్ లీక్.. ఆస‌క్తి రేకెత్తిస్తున్న పోస్ట‌ర్..

December 17, 2021 11:51 AM

Pushpa 2 The Rule : పుష్ప‌.. త‌గ్గేదే లే.. గ‌త కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల‌లో ఇవే పేర్లు తెగ చ‌క్క‌ర్లు కొట్టాయి. ఆర్య‌, ఆర్య‌ 2 చిత్రాల త‌ర్వాత సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో రూపొందిన పుష్ప చిత్రం రెండు పార్ట్‌లుగా తెరకెక్కింది. తొలి పార్ట్ పుష్ప ది రైజ్ పేరుతో డిసెంబర్‌ 17న విడుదల అయింది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నేషనల్ క్రష్‌ రష్మిక మందన్న హీరోయిన్‌గా చేస్తున్న ఈ చిత‍్రంలో హీరో, కమెడియన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లు పుష్పరాజ్‌కు విలన్లుగా నటించడం విశేషం.

Pushpa 2 The Rule title leaked for pushpa 2nd part movie

ఓవ‌ర్సీస్‌లో ఈ చిత్రం ప్ర‌ద‌ర్శితం కాగా, ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. బ‌న్నీ పుష్ప‌రాజ్‌గా అద‌ర‌గొట్టాడ‌ని అంటున్నారు. అయితే పుష్ప సెకండ్‌ పార్ట్‌ సినిమా పేరును రివీల్‌ చేశాడు దర్శకుడు సుకుమార్‌. రెండో భాగం పేరును “పుష‍్ప: ది రైజ్” సినిమా చివర్లో చెప్పేశాడు. ఈ సెకండ్‌ పార్ట్‌కు ‘పుష్ప: ది రూల్‌’ అని ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ టైటిల్‌ సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

‘పుష్ప’ సినిమాపై అంచ‌నాలు బాగా పెంచారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా..? ఎప్పుడెప్పుడు బన్నీ విశ్వరూపం చూద్దామా.. అని అభిమానులు కాచుకు కూర్చోగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల‌లో విడుద‌ల అయింది. ఈ మూవీ బ‌న్నీ అభిమానుల‌కి పూన‌కాలు తెప్పించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now