Bigg Boss: స‌ర‌దా, స‌న్నీ ఒకే అక్ష‌రంతో మొద‌ల‌వుతాయ‌ని ప్ర‌శంస‌లు కురిపించిన బిగ్ బాస్

December 17, 2021 10:38 AM

Bigg Boss: బిగ్ బాస్ సీజ‌న్ 5కి సంబంధించిన 101వ ఎపిసోడ్‌లో ష‌ణ్ముఖ్‌, స‌న్నీల ఎమోష‌న‌ల్ జ‌ర్నీని చూపించారు. షణ్ముఖ్ జర్నీ గురించి అద్భుతంగా మాట్లాడారు బిగ్ బాస్. అర్ధం చేసుకునే స్నేహితులు ఈ ఇంట్లో దొరికారని.. మీ మనసుకి దగ్గరైన వారితో అభిప్రాయభేదాలు వచ్చిన ప్రతిసారి.. మీరు మోసిన బరువుని బిగ్ బాస్ గమనించారని చెప్పారు.

Bigg Boss praised sunny for his fun and entertainment

మీకు ఇష్టమైన చోటు మోజ్ రూం అని బిగ్ బాస్‌కి తెలుసు.. మీలోని ప్రేమను ఆ గది చూసింది.. ’ అంటూ చెప్పుకొచ్చారు బిగ్ బాస్. మొత్తంగా షణ్ముఖ్ గురించి బిగ్ బాస్ చెప్పిన దాంట్లో మోజ్ రూం ఒకటి కాగా.. మిగిలినది అంతా సిరి కోసమే అన్నట్టుగా ఉంది. మీ మనసుని తాకిన ఫొటో గ్రాఫ్‌ని మీతో కలిసి తీసుకుని వెళ్లండని బిగ్ బాస్ చెప్పడంతో తన తల్లితో కలిసి ఉన్న ఫొటోని తీసుకుని వెళ్లాడు షణ్ముఖ్. అదే ఫొటోలో సిరి కూడా ఉండటంతో అది చూసి తెగ పొంగిపోయింది సిరి.

ఇక స‌న్నీ వంతు రావ‌డంతో .. ‘సరదా సన్నీ ఒకే అక్షరంతో మొదలౌతాయని.. మీరు గుర్తు చేశారు. ఈ ఇంట్లో మీ బంధాలు.. గెలిచిన ఆటలు.. జరిగిన గొడవలు.. మోసిన నిందలు.. చేసిన వినోదం.. ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా అందరి ముఖంపై నవ్వు తీసుకువచ్చి ఎంటర్ టైనర్‌గా అందరి మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. మీ వాళ్ల కోసం మీరు నిలబడే తీరు.. వాళ్లు మిమ్మల్ని ఇష్టపడినా, లేకున్నా.. మీలోని స్నేహితుడు వాళ్లని పరిచయం చేశాడు.

మీలోని కోపం మీకు ఇబ్బందులను తీసుకుని వచ్చి.. అందరి ముందు దోషిగా నిలబెట్టిన క్షణాలు.. మీ మనసుని గాయం చేసిన విషయాన్ని బిగ్ బాస్ గమనించారు. ప్రతి టాస్క్‌లోనూ గెలవాలనే మీ తపన.. గెలిచేవరకూ పోరాడే పట్టుదల.. మీ ఓర్పు.. మిమ్మల్ని ఇక్కడి వరకూ తీసుకుని వచ్చింది. ఒంటరిగా వచ్చిన మనిషికి కొంచెం ప్రేమను సంపాదించుకోవడం కంటే పెద్ద విజయం ఏదీ లేదని మీరు సాధించిన విజయమే మీకు గుర్తు చేస్తుంది. ’ అంటూ సన్నీ జర్నీని చూపించారు బిగ్ బాస్.

మీ మనసుకి దగ్గరైన ఒక ఫొటోగ్రాఫ్‌ని మీతో తీసుకుని వెళ్లండని బిగ్ బాస్ చెప్పడంతో.. తన తల్లితో ఉన్న ఫొటోతో పాటు.. మానస్‌తో ఉన్న ఫొటోని కూడా తీసుకున్నాడు. మొత్తంగా ఫైనల్‌కి చేరిన ఐదుగురు కంటెస్టెంట్స్‌కి సంబంధించిన జర్నీలలో న‌లుగురి వీడియోలు ప్ర‌సారం కాగా, సిరి జర్నీ వీడియో నేడు ప్రసారం కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now