Bigg Boss 5 : కాజ‌ల్ ఔట్.. టాప్ 5లో ఆ ఐదుగురు..!

December 12, 2021 4:15 PM

Bigg Boss 5 : బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మం ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. 19మందితో మొద‌లైన ఈ షోలో ప్ర‌స్తుతం కేవ‌లం ఆరుగురు మాత్ర‌మే ఉన్నారు. అయితే ఈ రోజు ఒక‌రు హౌజ్ నుండి ఎలిమినేట్ కానుండ‌గా, టాప్ 5లో ఎవ‌రు ఉంటార‌నే చ‌ర్చ కొద్ది రోజులుగా న‌డుస్తోంది. ఈ వారం సన్నీ టాప్ ఓటింగ్‌తో దూసుకుపోగా.. తరువాతి స్థానంలో షణ్ముఖ్ నిలిచాడు.. సిరి కూడా సేఫ్ కావడంతో.. మానస్-కాజల్‌ల మధ్య టఫ్ ఫైట్ నడిచింది. ఇందులో కాజల్ వెనుకబడిపోవడంతో మానస్ సేఫ్ అయ్యి కాజల్ ఎలిమినేట్ అయింది.

Bigg Boss 5 kajal evicted from house those five are in top

రెండు వారాలుగా ష‌ణ్ముఖ్‌కి బాగా నెగెటివిటీ వ‌చ్చింది. అతడు ఈ వారం ఎలిమినేట్ అవుతాడ‌ని అంద‌రూ ఊహించ‌గా, ఆయ‌న‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వ‌ల‌న సేవ్ అయ్యాడు. ఇక కాజ‌ల్ ఎప్ప‌టి నుండో ఎలిమినేష‌న్ కావ‌ల‌సి ఉన్నా మెల్లమెల్ల‌గా ఇక్క‌డి వ‌ర‌కు చేరుకుంది. ఎట్ట‌కేల‌కు 14వ వారం ఎలిమినేట్ అయింది. బిగ్‌‌బాస్ హౌజ్‌‌లోకి 17వ కంటెస్టెంట్‌‌గా అడుగుపెట్టిన కాజల్.. మొదటి రెండు మూడు వారాల్లోనే ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారంతా.. కానీ.. అదృష్టం, ఆటతో ఇక్క‌డి వ‌ర‌కు వ‌చ్చింది.

ఇప్పటికే సింగర్ శ్రీరామ్ ఫినాలేకి చేరుకోగా, తాజాగా స‌న్నీ కూడా ఫినాలేకి చేరుకున్న‌ట్టు ప్ర‌క‌టించాడు నాగ్. ఇక ఈ రోజు కాజ‌ల్ ఎలిమినేట్ కావ‌డంతో మాన‌స్, ష‌ణ్ముఖ్‌, సిరిలు కూడా ఫినాలే రేసులో ఉన్నారు. అయితే ఈ ఐదుగురిలో ఎవ‌రెవ‌రికి ఏఏ స్థానాలు ద‌క్కుతాయ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. డిసెంబ‌ర్ 19న ఫినాలే జ‌ర‌గ‌నుండ‌గా, ఈ కార్య‌క్ర‌మానికి గెస్ట్ గా చిరునే వ‌స్తార‌ని ప్రచారం న‌డుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now