NTR Watch : ఎన్టీఆర్ వాచ్ ధ‌ర ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెట్టాల్సిందే..!

December 12, 2021 10:34 AM

NTR Watch : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రు అనే విష‌యం తెలిసిందే. ఆయ‌న ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మార‌బోతున్నాడు. ఈ క్ర‌మంలో ఎన్టీఆర్‌కి సంబంధించిన ఏ విష‌యం అయినా ఇట్టే వైర‌ల్ అవుతోంది. అంతేకాదు ఆయ‌న ధరించే మాస్క్‌, బ్లేజర్‌, షూ, వాచ్‌ల‌ గురించి సోషల్‌ మీడియాలో చర్చ జ‌రుగుతోంది. తాజాగా ఎన్టీఆర్ వాచ్‌కి సంబంధించిన వార్త ఒక‌టి నెట్టింట వైర‌ల్‌గా మారింది.

NTR Watch price you will be shocked to know

రీసెంట్‌గా జ‌రిగిన ప్రెస్ మీట్‌లో ఎన్టీఆర్ చేతికి ఉన్న వాచ్ ఒక‌టి అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. ఆ వాచ్ ధ‌ర ఎంత అయి ఉంటుందా.. అని అంద‌రూ ఆరాలు తీయ‌గా, ఆ వాచ్ రేటు అక్షరాలారూ.4 కోట్లు అని తెలిసింది. నాలుగు కోట్ల రూపాయల వాచ్ ఏంటీ.. అని అనిపింస్తుంది కదా.. అవును రిచర్డ్ మిల్లే ఆర్ఎం 011 కార్బోన్ ఎన్టీపీటీ గ్రోస్జీన్ రోజ్ గోల్డ్ లోటస్ F1 టీం లిమిటెడ్ ఎడిషన్ వాచ్ ఖరీదు ఆన్ లైన్ లో 3 కోట్ల 99 లక్షల 32 వేల 392 రూపాయలుగా క‌నిపిస్తోంది.

ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన వాచ్‌లతో ఇది ఒకటి. ఈ బ్రాండ్‌లో లభించే ప్రతి వాచ్‌ చాలా ఖరీదైనదే. ఎన్టీఆర్‌ ఇష్టంతో ఈ వాచ్ కొనులుగోలు చేశాడట. ఇలాంటివి ఆయన దగ్గర మరో రెండు వాచ్ లు ఉన్నాయని సమాచారం. వాస్తవానికి ఎన్టీఆర్ కి కార్లు, వాచ్‌లు, దుస్తులు అంటే చాలా ఇష్టం. వాటికోసం కోట్లలో ఖర్చు చేస్తుంటారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్ర ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ త‌ర్వాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now