David Warner Pushpa : పుష్పరాజ్‌గా మారిన డేవిడ్ వార్న‌ర్.. ఏ మాత్రం త‌గ్గ‌ట్లేదుగా..!

December 12, 2021 4:28 PM

David Warner Pushpa : డేవిడ్ వార్న‌ర్.. ఐపీఎల్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌ర‌య్యాడు. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో తెలుగు సినిమాల‌కు సంబంధించిన పాట‌ల‌కు డ్యాన్స్ లు చేస్తూ ఆక‌ట్టుకుంటున్నాడు. కరోనా వేళ క్రికెట్‌ ఆడలేకపోయిన వార్నర్‌ తన భార్యతో కలిసి చేసిన టిక్‌టాక్‌ వీడియోలతో భలేగా ఫేమస్ అయిపోయాడు. అల్లు అర్జున్‌ ‘అల వైకుంఠపురంలో క్యాండీ వార్నర్‌తో కలిసి ‘బుట్టబొమ్మ’.. మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’లో మైండ్‌ బ్లాక్‌ పాటలతోపాటు ప‌లు సాంగ్స్‌కి డ్యాన్స్‌లు చేసి ఫేమ‌స్ అయ్యాడు.

David Warner Pushpa getup attracting netizen

రీసెంట్‌గా పునీత్ రాజ్ కుమార్‌కి సంబంధించి కూడా ఓ వీడియో చేసి క‌న్న‌డిగుల అభిమానం చూర‌గొన్నాడు. తాజాగా బ‌న్నీ లేటెస్ట్ మూవీ పుష్ప ది రైజ్‌ సినిమాలో ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా..’ సాంగ్‌లో ఫేస్ మార్ఫ్ చేసి ఆ వీడియోను త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఎంత‌లా వైర‌ల్ అవుతుందంటే ఆ వీడియోను ఏకంగా 2 మిలియ‌న్ల మంది వీక్షించారు.

వార్న‌ర్ వీడియోపై విరాట్‌ కోహ్లీ .. ‘నువ్వు ఓకే నా!’ అని కామెంట్‌ చేయగా.. ‘కాస్త గొంతు పట్టేసినట్టుంది..’ అని వార్నర్ సరదాగా సమాధానం ఇచ్చాడు. దీనిని చూసిన అల్లుఅర్జున్‌ ‘‘ మై బ్రదర్‌ వార్నర్‌.. తగ్గేదేలే’’ అని కామెంట్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి.

https://www.instagram.com/p/CXVv7sbJU1X/?utm_source=ig_embed&ig_rid=d6429d75-640f-4ca4-a80a-d4ae462c9f1e

ఇక ఇదిలా ఉండగా వార్న‌ర్ ప్ర‌స్తుతం యాసెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఆడుతున్నాడు. తొలి టెస్టులో చెలరేగి కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్న ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. రెండో టెస్ట్‌కి సిద్ధం అవుతున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Stories

Leave a Comment