Lobo Bigg Boss : క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన లోబో భార్య‌..!

December 11, 2021 6:44 PM

Lobo Bigg Boss : ఒక‌ప్పుడు వీజేగా కొద్ది మందికి మాత్ర‌మే ప‌రిచ‌యం అయిన లోబో బిగ్ బాస్ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. సీక్రెట్ రూంలోకి వెళ్లినా కూడా ఆ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోలేక బ‌య‌ట‌కు వ‌చ్చాడు లోబో. అయితే బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్లు అడుగుపెట్టి 50 రోజులు పూర్తయిన స‌మ‌యంలో బిగ్‌బాస్‌.. మీకు ఎంతో ప్రియమైనవారి నుంచి లేఖను పొందే అవకాశం లభిస్తుందని ఊరించిన విష‌యం తెలిసిందే.

Lobo Bigg Boss got twins

అక్క‌డ చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చాడు. ఇద్ద‌రు కంటెస్టెంట్స్‌లో ఒకరు మాత్ర‌మే లేఖ అందుకునే ఛాన్స్ దొరుకుతుంద‌ని అన్నాడు. ఆ స‌మ‌యంలో లోబో మాట్లాడుతూ.. తన భార్య గర్భవతి అని, అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందంటూనే పింకీ కోసం తన లేఖను త్యాగం చేశాడు. కానీ ఉబికి వస్తున్న కన్నీళ్లను మాత్రం ఆపుకోలేకపోయాడు. అయితే లోబో భార్య తాజాగా ఇద్ద‌రు క‌వ‌ల‌ల‌కు జ‌న్మినిచ్చింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ విష‌యం తెలుసుకున్న అభిమానులు లోబోకు డ‌బుల్ బొనాంజా. ఈ ఏడాదంతా మంచే జ‌రుగుతున్న‌ట్టుందే అని కామెంట్స్ పెడుతున్నారు. కాగా, చిరంజీవి సినిమాలో లోబో ఆఫ‌ర్ అందుకున్న విష‌యం తెలిసిందే. ‘నా కల నిజమైంది. చిరంజీవి సార్‌ సినిమాలో ఆఫర్‌ వచ్చింది’ అంటూ ఇటీవ‌ల స్పష్టం చేశాడు. ‘ సినిమాలో నాది చిరు సార్‌ని అంటిపెట్టుకుని ఉండే పాత్ర. మెగాస్టార్‌ పక్కన నటించడం అంటే నా కల సాకారమైనట్లే’ అని సంబర పడిపోయాడు. దీంతోపాటు ఈ సినిమాను మెహర్‌ రమేశ్‌ తెరకెక్కిస్తున్నాడని చెప్పుకొచ్చాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now