Samantha : సమంత అందాల ఆరబోత.. ఏమాత్రం తగ్గడం లేదుగా.. ఉపాసన ఇంటి ఫంక్షన్‌లో..!

December 11, 2021 12:36 PM

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా సమంత ఎంతో మంచి పేరు సాధించింది. ముఖ్యంగా నాగచైతన్యతో విడాకుల తర్వాత తనను తాను స్ట్రాంగ్ గా మార్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె ఫ్రెండ్స్ తో కలిసి ఛార్ థామ్ యాత్రకు వెళ్లి ఎన్నో ప్రదేశాల్ని చూసింది. అలాగే దీపావళి పండుగను కూడా తన స్నేహితురాలు.. మోడల్ అయిన శిల్పారెడ్డి ఇంట్లో సెలెబ్రేట్ చేసుకుంది.

Samantha attended function at upsana home

ఈ వేడుకలతోపాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన దీపావళి సెలెబ్రేషన్స్ లో కూడా సమంత కనిపించింది. ఎంతో ఆనందంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఫోటోల్ని ఉపాసన తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది. అయితే ఈ వేడుకలకు సమంత చీర కట్టుకుని వచ్చినప్పటికీ అందాలను ఆరబోసింది. విడాకుల ప్రకటన తరువాత సమంత అంతకు ముందు కన్నా రెట్టించిన స్థాయిలో గ్లామర్‌ షో చేస్తుండడం విశేషం.

ఇక ఈ సెలెబ్రేషన్స్ లో రామ్ చరణ్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. రీసెంట్ గా మళ్ళీ సమంత.. ఉపాసన ఫ్యామిలీతో కలిసి సరదాగా గడిపింది. పుష్పలో ఐటమ్‌ సాంగ్‌లోనూ సమంత అందాలను ఆరబోయడం గమనార్హం.

ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక రామ్ చరణ్ భార్య ఉపాసన సోదరి అనుష్పాల కామినేని పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి సమంత, శ్రియ, శిల్పారెడ్డిలతోపాటు సానియా మీర్జా కూడా వచ్చింది. ఈ క్యార్యక్రమంలో మెగా ఫ్యామిలీతోపాటు పలువురు సెలెబ్రిటీలు ఎంతో చక్కగా ఎంజాయ్ చేశారు. ఇక సమంత హీరోయిన్ గా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now