Bigg Boss 5 : ఈ వీక్ ఊహించ‌ని ఎలిమినేష‌న్‌.. అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్!

December 11, 2021 11:06 AM

Bigg Boss 5 : బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 మరో వారం రోజుల్లో ముగియనుంది. ఈ వీక్ ఎలిమినేషన్ లో ఎవరు ఇంటి నుండి వెళ్ళిపోతారనేది హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ లాస్ట్ వీక్ కావడంతో అందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇంటిలో ఉన్నవాళ్లల్లో ఎవరు వీక్ గా ఉన్నారనే టాపిక్ కు వస్తే.. కాజల్, సిరి పేర్లు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే టాప్ ఫైవ్ లో ఓ లేడీ కంటెస్టెంట్ కూడా లేకపోతే బిగ్ బాస్ పై తీవ్ర విమర్శలు వస్తాయని అనుకుంటున్నారు.

Bigg Boss 5 given unimaginable twist and elimination

అయితే ఈ వీక్ ఎలిమినేషన్ లో ఇద్దరు ఎలిమినేట్ అవుతారని అంటున్నారు. ఇక ఇప్పటికే మేల్ కంటెస్టెంట్స్ లో శ్రీరామ్ ఫైనల్ గా చేరుకున్నాడు. నెక్ట్స్ సన్నీ, షణ్ముఖ్‌ స్ట్రాంగ్ ప్లేయర్స్. మానస్ వీళ్ళతో పోలిస్తే కాస్త వీక్ అనే చెప్పాలి. అందుకే నిన్న మొన్నటివరకు ఇంటి నుండి వెళ్ళిపోయే వ్యక్తుల్లో మానస్ ఉంటాడని అనుకున్నారు. అయితే ఒక్కసారిగా ఓటింగ్ శాతం మారిపోయిందని విమర్శకులు అంటున్నారు. షణ్ముఖ్ ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు ఉంటాయని అంటున్నారు. ఎందుకంటే లాస్ట్ మూడు రోజులుగా సిరితో, షణ్ను బిహేవియర్ వల్లే తనకు ఓటింగ్ శాతం తగ్గినట్లుగా తెలుస్తోంది.

దీంతో మానస్ హైప్ అయ్యాడు. ఈ విషయంలో సోషల్ మీడియాలో మరో న్యూస్ కూడా వైరల్ అవుతోంది. ఆ వారానికి ఎవర్ని అయితే ఎలిమినేట్ చేయాలని చూస్తారో.. వాళ్ళపై ఎక్కువగా నెగిటివ్ అయ్యేలా బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ వీక్ లో ఎక్కువగా షణ్నుపై నెగిటివ్ కంటెంట్ వైరల్ అయ్యింది. ఇంట్లో ఏం జరుగుతుందనేది సరిగ్గా తెలీదు గానీ.. బయటకు చూపించేది మాత్రం నెగెటివే. ఈ నేపథ్యంలోనే ఈవారం ఇంటి నుండి బయటకు వచ్చే లిస్ట్ లో షణ్ను బయటకు వచ్చేస్తాడనే వార్తలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now