Pushpa Movie : స‌మంత స్పెష‌ల్ సాంగ్ పాడిన గాయ‌ని ఈమెనే.. ఎవ‌రు అంటే..?

December 11, 2021 10:19 AM

Pushpa Movie : తొలిసారి స‌మంత పుష్ప సినిమా కోసం ఐటమ్‌ భామ‌గా మారిన విష‌యం తెలిసిందే. ఈ సాంగ్ ను తాజాగా విడుద‌ల చేశారు. ‘ఊ అంటావా.. ఊహు అంటావా’ అనే పాట మత్తు వాయిస్‌తో సాగ‌గా, ఈ పాటలో సమంత తన మాస్‌ స్టెప్పులతో అదరగొట్టింది. సామ్‌ కాస్ట్యూమ్‌, స్టైల్‌, లుకింగ్‌ అన్నీ పాటకు పర్‌ఫెక్ట్‌ సెట్‌ అయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరోసారి మార్మోగించడంతో సాంగ్‌ బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ అవుతుందనడంలో సందేహం లేదు.

Pushpa Movie she is the singer who sung for special song of samantha

అయితే చంద్రబోస్‌ రాసిన ఈ ఐటమ్‌ పాటను పాడింది ఇంద్రావతి చౌహాన్. తన గొంతుతో ఈ పాటను మరో మెట్టు ఎక్కించింది. దీంతో ఈ సింగర్‌ ఎవరని వెతకడం ప్రారంభించారు నెటిజన్లు. మంగ్లీలాగే ఇంద్రావ‌తి చౌహాన్ కూడా ప‌లు జాన‌పాద పాటలు పాడి గుర్తింపు తెచ్చుకుంది. అప్ప‌ట్లో కోటి జడ్జిగా వ‌చ్చిన బోల్ బేబీ బోల్ రియాలిటీ షోలో కూడా పాల్గొంది. పుష్ప సినిమా కంటే ముందు జార్జి రెడ్డి సినిమాలో కూడా మంగ్లీ చెల్లెలు ఒక‌ పాట పాడింది.

జాజిమొగులాలి అనే సాగే ఈ పాట కూడా బాగానే ఉంటుంది. కానీ అంత‌గా పాపుల‌ర్ కాలేదు. కానీ ఇదే సినిమాలో మంగ్లీ పాడిన వాడు న‌డిపే బండి రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ అనే సాంగ్ మాత్రం మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు పుష్ప సినిమాలో ఐటమ్‌ సాంగ్ పాడే ఛాన్స్ ద‌క్కించుకుంది ఇంద్రావ‌తి చౌహాన్‌. మ‌త్తెక్కించే వాయిస్‌తో ఊ అంటావా మామ‌.. ఊఊ అంటావా మామ అంటూ ఈమె పాడిన పాట వింటూ ఇప్పుడు యూత్ పిచ్చెక్కిపోతున్నారు. ఈ పాట‌ని క‌న్న‌డలో మంగ్లీ పాడి అల‌రించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now