Vijay Devarakonda : విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి అలాంటి కామెంట్స్ చేసిన బాలీవుడ్ హీరోయిన్‌..!

December 10, 2021 6:38 PM

Vijay Devarakonda : విజయ్‌ దేవరకొండకు స్టార్ హీరోల‌కు ఉన్నంత క్రేజ్ వచ్చింది. త‌న‌దైన స్టైల్‌లో మాట్లాడుతూ అభిమానులని ఎంట‌ర్‌టైన్ చేస్తూ ఉండే విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాల‌లోనూ డిఫ‌రెంట్ ఆటిట్యూడ్ చూపిస్తూ అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతూ ఉంటాడు. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ లైగర్ చిత్రంలో క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. ఇందులో అన‌న్య పాండే విజ‌య్ స‌ర‌స‌న జోడీ క‌ట్టింది.

sara ali khan comments about Vijay Devarakonda  viral

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో న‌టించాల‌ని యంగ్ భామ‌ల‌కు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఇప్ప‌టికే చాలా మంది ఓపెన్ అయి ఆయ‌నతో న‌టించాల‌ని ఉంద‌ని అన్నారు. తాజాగా సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ విజయ్ దేవరకొండతో నటించాలని ఉందని ఓపెన్ అయ్యింది. ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సారా ఈ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె ‘అత్రాంగి రే’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీలో అక్షయ్ కుమార్, ధనుష్ హీరోలుగా నటిస్తున్నారు.

ధనుష్ కి జంటగా సారా అలీఖాన్ కనిపించనుంది. ధనుష్ తో నటించడం గొప్ప అనుభూతి అని చెప్పిన సారా అలీ ఖాన్ ని.. ధనుష్ కాకుండా మీరు నటించాలని కోరుకుంటున్న సౌత్ స్టార్ ఎవరని అడగగా.. ఠక్కున విజయ్ దేవరకొండ పేరు చెప్పింది. ఆయన గ్రేట్ యాక్టర్. సూపర్ కూల్ . అలాగే సో హాట్.. అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. సారా అలీ ఖాన్ కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి. మ‌రి రానున్న రోజుల‌లో సారా అలీ ఖాన్.. విజ‌య్‌కి జోడీగా న‌టిస్తుందా.. లేదా.. అనేది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now