ముంబైలో RRR చిత్ర యూనిట్ ప్రెస్ మీట్‌.. రామ్ చ‌ర‌ణ్ వెళ్లడం లేదు.. ఎందుక‌ని..?

December 9, 2021 12:35 PM

RRR : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్రతిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తోన్న చిత్రం RRR. ఈ మూవీకి సంబంధించిన ట్రైల‌ర్‌ను గ‌త కొంత సేప‌టి క్రిత‌మే విడుద‌ల చేయ‌గా.. దానికి భారీ ఎత్తున స్పంద‌న ల‌భిస్తోంది. యూట్యూబ్‌లో ఇప్ప‌టికే ఈ ట్రైల‌ర్ ట్రెండింగ్‌లోకి వ‌చ్చేసింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా మొత్తం RRR నామస్మ‌ర‌ణ‌తో మారుమోగిపోతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు థియేట‌ర్ల‌లోనూ RRR ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు.

rrr movie press meet in mumbai why ram charan not going

కాగా RRR చిత్ర‌యూనిట్ ముంబైలో నేడు హిందీ మీడియాతో స‌మావేశం కానున్నారు. ఈ క్ర‌మంలోనే చిత్ర న‌టీన‌టులు, సిబ్బంది అంద‌రూ ప్రెస్ మీట్‌లో పాల్గొన‌నున్నారు. బీ టౌన్ మీడియాతో మాట్లాడ‌నున్నారు. ఇక చిత్రంలో లీడ్ హీరోల్లో ఒక‌రిగా ఉన్న ఎన్టీఆర్ ఇప్ప‌టికే ముంబై చేరుకున్నారు. అయితే మ‌రో లీడ్ హీరో రామ్ చ‌ర‌ణ్ తేజ మాత్రం ఈ ప్రెస్ మీట్‌లో పాల్గొన‌డం లేదు.

ముంబైలో జ‌ర‌గ‌నున్న RRR చిత్ర యూనిట్ ప్రెస్ మీట్‌కు రామ్ చ‌ర‌ణ్ హాజ‌రు కావ‌డం లేదు. కార‌ణం.. త‌న కుటుంబంలో ఓ వివాహ వేడుక జ‌ర‌గ‌నుండ‌డ‌మే. రామ్ చ‌ర‌ణ్ తేజ భార్య ఉపాస‌న సోద‌రి అనుష్ప‌ల కామినేని వివాహం అర్మాన్ ఇబ్ర‌హీంతో ఇటీవ‌ల జ‌రిగిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే ఈ పెళ్లికి సంబంధించి వేడుక‌లు ఇంకా పూర్తి కాలేదు. అయితే ఇవాళ ముంబైలో జ‌ర‌గ‌నున్న ప్రెస్ మీట్‌కు హాజ‌రు కాలేక‌పోయిన‌ప్ప‌టికీ.. త్వ‌ర‌లో దేశ‌వ్యాప్తంగా అనేక చోట్ల జ‌ర‌గ‌నున్న RRR చిత్ర ప్ర‌మోష‌న్ల‌లో రామ్ చ‌ర‌ణ్ తేజ పాల్గొననున్నారు.

కాగా తాజాగా విడుద‌లైన RRR ట్రైల‌ర్ కు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల నుంచి విశేష రీతిలో స్పంద‌న ల‌భిస్తోంది. బాహుబ‌లి త‌రువాత విడుద‌ల అవుతున్న రాజ‌మౌళి చిత్రం కావ‌డంతో అభిమానుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ మూవీ ట్రైల‌ర్‌ను చూశాక‌.. సినిమా ఎప్పుడు విడుద‌ల అవుతుందా.. అని అభిమానుల్లో ఉత్కంఠ మ‌రింత పెరిగింది. ఇక RRR మూవీ జ‌న‌వ‌రి 7, 2022న ప్ర‌పంప వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఐమ్యాక్స్‌, 3డీ ఫార్మాట్‌ల‌లోనూ మూవీని విడుద‌ల చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now