Payal Rajput : పాయ‌ల్ రాజ్‌పూత్‌కు క‌ష్టాలు..? తెగ ఆందోళ‌న చెందుతున్న బ్యూటీ..?

December 8, 2021 9:59 AM

Payal Rajput is facing problems she is worrying much about the issue - india daily live

Payal Rajput Responded To Trolls But She Is Worrying : ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా తెలుగు వెండి తెర‌కు ప‌రిచ‌యం అయిన బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పూత్‌. త‌న తొలి సినిమాలోనే బోల్డ్ గా న‌టించి ఎంతో గుర్తింపు పొందింది. ఆ మూవీ హిట్ అవ‌డంతో ఈ అమ్మ‌డికి ప‌లు సినిమాల్లో వ‌రుస అవ‌కాశాలు కూడా వ‌చ్చాయి. కానీ అవేవీ హిట్ సాధించ‌లేక‌పోయాయి. దీంతో ఈమె ప్ర‌స్తుతం మ‌ళ్లీ మంచి అవ‌కాశాల కోసం ఎదురు చూస్తోంది.

ఇక ఇటీవ‌ల త‌న ప్రియుడితో క‌లిసి ఫొటోలు దిగిన పాయ‌ల్ అభ్యంత‌ర‌క‌ర రీతిలో ద‌ర్శ‌న‌మిచ్చింది. అనంత‌రం యెల్లో క‌ల‌ర్ బ్లేజ‌ర్ వేసుకుని లోప‌ల ఎలాంటి ఆచ్చాద‌న లేకుండా బిహైండ్ ది సీన్స్ పేరిట ఓ వీడియోను రిలీజ్ చేసింది. అయితే అందులో మరీ దారుణంగా క‌నిపించ‌డంతో వెంట‌నే ఆమె ఆ వీడియోను డిలీట్ చేసింది. అయిన‌ప్ప‌టికీ అప్ప‌టికే ఆ వీడియో వైర‌ల్ అయింది.

అయితే త‌న‌పై వ‌స్తున్న ట్రోల్స్‌కు కూడా పాయ‌ల్ రాజ్ పూత్ స్పందించింది. అంద‌రు మ‌హిళ‌ల్లాగే త‌న‌కూ ఉన్నాయ‌ని.. అంత‌మాత్రానికే ఇంత రాద్దాంతం చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పుకొచ్చింది. అయిన‌ప్పటికీ ఆమెపై వ‌స్తున్న ట్రోల్స్‌, విమ‌ర్శ‌లు మాత్రం ఆగ‌డం లేదు. దీంతో ఆ విమ‌ర్శ‌లు ఎప్పుడు త‌గ్గుతాయోన‌ని ఈమె తెగ ఆందోళ‌న చెందుతున్న‌ట్లు తెలుస్తోంది.

అయితే సెల‌బ్రిటీలు క‌నుక సోష‌ల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసేముందు.. ఒక‌టికి రెండు సార్లు చెక్ చేసుకుని ఆలోచించి మ‌రీ పోస్ట్‌లు పెట్టాలి. లేదంటే సెల‌బ్రిటీలు ఎలాంటి ఇబ్బందుల‌కు గుర‌వుతారో ఇప్ప‌టికే మ‌నం అనేక సంఘ‌ట‌న‌ల్లో చూశాం. పాయ‌ల్ రాజ్‌పూత్ విష‌యంలోనూ అలాగే జ‌రిగింది. మ‌రి ఈ అమ్మ‌డిపై ట్రోల్స్ ఎప్పుడు త‌గ్గుతాయో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now