అఖండ మూవీతో ల‌క్ క‌లసి వ‌చ్చిందా..? భారీగా డిమాండ్ చేస్తున్న ప్ర‌గ్యా జైస్వాల్‌..?

December 8, 2021 8:27 AM

సాధార‌ణంగా సినీ ఇండ‌స్ట్రీలో ల‌క్ క‌లసి వ‌చ్చి సినిమాలు బాగా హిట్ అవుతుంటే ఏ స్టార్ అయినా స‌రే రెమ్యున‌రేష‌న్‌ను అమాంతం పెంచేస్తారు. అది స‌హ‌జంగా జ‌రిగేదే. దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌న్న చందంగా.. పాపుల‌ర్ అయిన‌ప్పుడే అధిక మొత్తంలో రెమ్యున‌రేష‌న్‌ను డిమాండ్ చేస్తుంటారు. ఇక తాజాగా అఖండ బ్యూటీ ప్ర‌గ్యా జైస్వాల్ కూడా ఈ జాబితాలో చేరిపోయింది.

pragya jaiswal demanding more after the success of akhanda movie

నిజానికి ప్ర‌గ్యా జైస్వాల్‌కు ఎప్ప‌టి నుంచో అస‌లు ఒక్క హిట్ కూడా లేదు. అప్పుడెప్పుడో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న కంచె మూవీలో న‌టించిన ఈ బ్యూటీకి గ‌త 10 ఏళ్ల‌లో ఒక్క హిట్ కూడా ప‌డ‌లేదు. కంచె త‌రువాత అఖండ రూపంలో ఇప్పుడు మ‌ళ్లీ ప్ర‌గ్యా జైస్వాల్‌కు ద‌శ తిరిగింది. ఆమె బాల‌కృష్ణ స‌ర‌స‌న న‌టించే చాన్స్ కొట్టేసింది. ఈ మూవీ హిట్ కావ‌డంతో ఆమెకు ల‌క్ క‌ల‌సి వ‌చ్చింద‌నే చెప్పాలి.

అఖండ‌లో ప్ర‌గ్యా క‌లెక్ట‌ర్ పాత్ర‌లో న‌టించి మెప్పించింది. ఈ క్ర‌మంలోనే ఈమె ప్ర‌స్తుతం రెమ్యున‌రేష‌న్‌ను బాగా పెంచిన‌ట్లు స‌మాచారం. ఏకంగా రూ.1 కోటి మేర డిమాండ్ చేస్తుంద‌ని తెలుస్తోంది. నిజానికి ప్ర‌గ్యాకు ఇంత‌టి భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఎప్పుడూ ల‌భించ‌లేదు. కంచె హిట్ అయింది కానీ.. మ‌రీ ఈ విధంగా హిట్ కాలేదు. ఈ క్ర‌మంలోనే ఈమెకు అఖండ‌తో స్టార్ డ‌మ్ వ‌చ్చింది. దీంతో దాన్ని ఈమె క్యాష్ చేసుకునే ప‌నిలో ప‌డింది.

ఇక ప్ర‌గ్యాకు సీనియ‌ర్ న‌టుల‌తో న‌టించేందుకు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని గ‌తంలోనే చెప్పింది. క‌నుక ఈమెను మ‌ళ్లీ బాల‌కృష్ణ సినిమాలోనే తీసుకునే అవ‌కాశం కూడా లేక‌పోలేద‌ని అంటున్నారు. మ‌రి ప్ర‌గ్యా ద‌శ ఇక నుంచి తిరిగిపోతుందా.. లేదా.. అన్న‌ది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment