Bigg Boss 5 : శ్రీరామ్‌ అలాంటి వాడు.. షణ్ముఖ్‌కు ఓటు వేయండి.. శ్రీరెడ్డి విజ్ఞప్తి..

December 7, 2021 10:38 PM

Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్-5 ఫినాలే దగ్గర పడుతుండటంతో ఫ్యాన్స్, ప‌లువురు సెల‌బ్స్ త‌మ‌కు న‌చ్చిన కంటెస్టెంట్స్‌ కి స‌పోర్ట్ అందిస్తూ వ‌స్తున్నారు. సోష‌ల్ మీడియా ద్వారా న‌చ్చిన కంటెస్టెంట్స్‌కు ఓట్లు వేయ‌మ‌ని అడుగుతున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఆరుగురు సభ్యులు మాత్రమే ఉండగా అందులో సింగర్ శ్రీ రామచంద్ర ఇటీవల ఫినాలేకి చేరుకున్నాడు. ఆయన మినహా మిగతా హౌస్‌లో ఉన్న సిరి, కాజల్, మానస్, షణ్ముఖ్, సన్నీ అందరూ కూడా నామినేషన్స్ లోకి వెళ్లారు.

Bigg Boss 5 sri reddy says sriram is that type of person vote for shanmukh

శ్రీరామ‌చంద్ర ఫైన‌ల్‌కి వెళ్ల‌డంతో ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తూ ష‌ణ్ముఖ్‌ని విన్న‌ర్ చేయాల‌ని శ్రీ రెడ్డి కంక‌ణం క‌ట్టుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. శ్రీరామ చంద్రకి ఓటు వేయొద్దని కోరుతున్నా.. దానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి గెలిస్తే.. కొంతమందికి ప్రేరణగా ఉంటుంది.. ఇండియన్ ఐడల్ గెలిచాడు కాబట్టి.. బిగ్ బాస్ టైటిల్ కూడా ఇవ్వాలని అనుకుంటే అది తప్పు. శ్రీరామ చంద్ర ఫేక్ పర్సన్.. వ్యక్తిత్వం లేని వ్యక్తి.

ఇక షణ్ముఖ్ విషయానికి వస్తే.. అతను చాలా టాలెంటెండ్ అని నా ఫేస్ బుక్‌లో చాలా ఏళ్ల క్రితం పోస్టు పెట్టా. డౌన్ టు ఎర్త్ ఉండి.. షణ్ముఖ్ గేమ్ బాగా ఆడుతున్నాడని అంటున్నారు.. నేను అప్పుడప్పుడు అతని గేమ్ చూస్తున్నా. రెగ్యులర్‌గా ఫాలో కావడం లేదు కానీ.. అప్పుడప్పుడూ చూస్తున్నా. నా ఉద్దేశంలో షణ్ముఖ్‌కి ఓటు వేస్తే మంచి చేసినట్టే అవుతుంది.

షణ్ముఖ్ కి సపోర్ట్ చేయమని నన్ను ఎవరూ అడగలేదు, ఆ నిర్ణయం నా అంతట నేనే తీసుకున్నా.. ఎప్పుడో ఒకసారి రామ్ గోపాల్ వర్మ ఇన్‌ఫ్లూయెన్స్‌కి బలయ్యాను కానీ.. ఆ గుణ పాఠంతోనే ఎప్పుడూ ఎవరి మాటా వినకూడదని నిర్ణయించుకున్నానని ఆమె చెప్పుకొచ్చింది. దయచేసి ఎవరు మంచోళ్లో.. ఎవరు చెడ్డోళ్లో మీరే నిర్ణయించుకుని ఓటు వేయండి.. షణ్మఖ్‌ని గెలిపించండి.. అంటూ ఆడియన్స్‌ని కోరింది శ్రీ రెడ్డి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Stories

Leave a Comment