బిగ్ బాస్‌కి లంచం ఇచ్చి జ‌స్వంత్ హౌజ్‌లోకి వెళ్లాడా..?

December 7, 2021 3:45 PM

బిగ్ బాస్‌కి వెళ్లాల‌నే క‌ల చాలా మందికి ఉంటుంది. కానీ ఆ అదృష్టం కొంద‌రికే ద‌క్కుతుంటుంది. ఈ సీజ‌న్‌లో మోడ‌ల్‌గా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టిన జ‌స్వంత్ అనారోగ్యంతో బ‌య‌ట‌కు వ‌చ్చాడు. అయితే బ‌య‌ట‌కు వ‌చ్చాక జ‌స్వంత్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. బ‌య‌ట‌, సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తున్నాడు. అయితే జెస్సీ డబ్బులిచ్చి బిగ్ బాస్ షోకి వచ్చాడనేది కేవలం బయట ఉన్నవాళ్లు మాత్రమే అనడం కాదు.. హౌస్‌ లోపల ఉన్న కంటెస్టెంట్స్ కూడా అన్నారట. దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చాడు జ‌స్వంత్.

did bigg boss jessie given money and gone to bigg boss 5 telugu

నేను డబ్బులిచ్చి బిగ్ బాస్ హౌస్‌కి వచ్చానని కొంద‌రు అన్నారు. వాళ్లందరి కోసమే నేను నా అకౌంట్ లో ఎన్ని డబ్బులున్నాయో చూపిస్తున్నా. నా అకౌంట్ డీటెయిల్స్ మొత్తం ఇస్తా.. నాకు ఉన్నది ఒకే ఒక్క అకౌంట్.. అదే ఎస్బీఐ. నా అకౌంట్‌లో ప్రస్తుతం రూ.11 వేలు మాత్రమే ఉన్నాయి. నాకు బ్యాక్‌ గ్రౌండ్ ఏమీ లేదు.. మా నాన్న గారు చనిపోయారు.. నేను నైట్ షిఫ్ట్ జాబ్ చేస్తూ దాచుకున్న డబ్బులతో మోడలింగ్ నేర్చుకున్నాను. రూపాయి విలువ నాకు బాగా తెలుసు. దేవుడు నా కష్టాన్ని చూసి.. బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చాడు.

నేను మోడలింగ్‌లో ఉన్నాను కాబట్టి.. చాలామందికి తెలియదు.. నా డ్రెస్సింగ్ కూడా చాలా రిచ్‌గా ఉండటం చూసి.. బిగ్ బాస్ వాళ్లికి డబ్బులిచ్చి వచ్చా అని హౌస్‌లో ఉన్నవాళ్లే కామెంట్స్ చేశారు. నాకు డబ్బులిచ్చేంత స్థోమత లేదు.. నాకు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ కూడా లేరు. జెన్యున్‌గా గేమ్ ఆడాను.. స్ట్రైట్‌గానే వెళ్లాను.. స్ట్రైట్‌గానే ఆడాను.. స్టైట్‌గానే వచ్చాను. నన్ను ఎవరైతే డబ్బులిచ్చి వచ్చానని అన్నారో వాళ్లందరికీ నేను ఒకటే చెప్తున్నా.. నేను స్టైట్‌గానే వెళ్లాను.. నా టాలెంట్‌తోనే బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది.. అంటూ క్లారిటీ ఇచ్చాడు జెస్సీ.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now