Payal Rajput : అలాంటి డ్రెస్ ఎందుకు వేసుకుందో.. వివ‌ర‌ణ ఇచ్చిన పాయ‌ల్ రాజ్‌పూత్‌..!

December 5, 2021 7:26 PM

Payal Rajput : ఆర్ఎక్స్‌100 చిత్రంతో న‌టి పాయ‌ల్ రాజ్‌పూత్ ఎంత‌టి క్రేజ్‌ను సంపాదించుకుందో అంద‌రికీ తెలిసిందే. ఆ మూవీతో వ‌చ్చిన గుర్తింపు కార‌ణంగా ఈ భామ‌కు గ్లామ‌ర్ క్వీన్ అనే ముద్ర ప‌డింది. దీంతో ఈమెకు ప‌లు సినిమాల్లో ఆఫ‌ర్లు వెతుక్కుంటూ వ‌చ్చాయి. త‌రువాత ఈమె న‌టించిన సినిమాల్లో చాలా వ‌ర‌కు అందాల‌ను ఆర‌బోసింది.

Payal Rajput given explanation why she wore that dress

ఆర్ఎక్స్‌100 చిత్రం త‌రువాత ప‌లు సినిమాల్లో ఆఫ‌ర్లు వ‌చ్చినా ఈమె న‌టించిన చిత్రాలు మాత్రం పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయాయి. దీంతో ఈమెకు ఆఫ‌ర్లు త‌గ్గాయి. అయితే సోష‌ల్ మీడియాలో మాత్రం ఈమె ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటూ వస్తోంది అందులో భాగంగానే కుర్ర‌కారు గుండెల్లో గుబులు రేపేలా ఫొటోషూట్‌లు చేస్తోంది.

ఇక ఇటీవ‌ల ఎల్లో క‌ల‌ర్ బ్లేజ‌ర్ ధ‌రించి.. పై భాగంలో లోప‌ల ఏమీ వేసుకోకుండా ఈమె ఫొటోల‌కు పోజులు ఇచ్చింది. ఈ క్ర‌మంలో ఆ వీడియోను ఈమె సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. అయితే చూపించ కూడ‌ని భాగాల‌ను చూపించ‌డంతో త‌ప్పు తెలుసుకున్న ఈమె వెంట‌నే ఆ వీడియోను డిలీట్ చేసింది. అయిన‌ప్ప‌టికీ అప్ప‌టికే ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

కాగా తాజాగా స‌ద‌రు వీడియోపై పాయ‌ల్ రాజ్‌పూత్ స్పందించింది. తాను అంద‌రు హీరోయిన్ల‌లాగే గ్లామ‌ర్ ఫొటోషూట్ చేద్దామ‌నుకున్నాన‌ని.. కానీ పొర‌పాటు జ‌రిగింద‌ని.. అందుక‌నే ఆ వీడియోను డిలీట్ చేయాల్సి వ‌చ్చింద‌ని తెలిపింది. అయితే అంద‌రు మ‌హిళ‌ల‌కు ఉన్న‌ట్లుగానే త‌న‌కు ఉన్నాయ‌ని.. అందువ‌ల్ల కొన్ని పార్ట్స్ క‌నిపించినందుకు అంత‌గా హ‌డావిడి చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆమె తెలిపింది. ఇక పాయ‌ల్ ప్ర‌స్తుతం ఆది సాయికుమార్‌కు జోడీగా కిరాత‌క అనే మూవీలో న‌టిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now