Anchor Ravi : ఫ్రెండ్ చేతిలో దారుణంగా మోసపోయిన ర‌వి.. రూ.45 ల‌క్ష‌లు తీసుకుని ఎగ్గొట్టాడు..

December 5, 2021 1:08 PM

Anchor Ravi : బుల్లితెరపై యాంకర్‌ రవి చేసే సందడి అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే రవికి భారీ ఎత్తున ఫ్యాన్స్‌ ఏర్పడ్డారు. ఇక ఇటీవల అతను బిగ్‌బాస్‌ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. భారీగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉండి ఓట్లు పడినప్పటికీ రవి ఎలిమినేట్‌ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో ఫ్యాన్స్‌ అన్నపూర్ణ స్టూడియో ఎదుట ఆందోళన చేపట్టారు. తరువాత ఆ విషయం సద్దుమణిగింది.

Anchor Ravi said he has given rs 45 lakhs to a friend and he cheated

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి తనకు చెందిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. తనకు ఎంతో నమ్మకంగా ఉన్న ఓ స్నేహితుడు తనను దారుణంగా మోసం చేశాడని రవి తెలిపాడు. దీంతో ఈ విషయం చెబుతూ రవి భావోద్వేగానికి గురయ్యాడు. ఆ వ్యక్తిని నమ్మి తాను రూ.45 లక్షలు అప్పుగా ఇచ్చానని, అయితే 20 రోజుల్లోనే అప్పు తీర్చేస్తానని అతను చెప్పాడని తెలిపాడు.

అప్పు ఇచ్చిన సమయంలో ఎలాంటి పత్రాలను కూడా రాసుకోలేదని రవి తెలిపాడు. దీంతో తాను మోసపోయానని అన్నాడు. ఆ వ్యక్తి బిజినెస్‌ పెట్టుకోవాలన్న.. డబ్బులు కావాలని అడిగితే.. వెంటనే రూ.45 లక్షలు ఇచ్చినట్లు తెలిపాడు. ఇప్పటికీ రెండు ఏళ్లు దాటిపోయిందని, అయినప్పటికీ కనీసం అతని ఆచూకీ కూడా లేదని రవి తెలియజేశాడు. ఈ క్రమంలో తాను చట్ట ప్రకారం ముందుకు సాగుతున్నానని అన్నాడు. అతడిని నమ్మి అన్ని డబ్బులను ఇస్తే అతను మాత్రం మోసం చేశాడని అన్నాడు.

రెండేళ్ల పాటు అతను తనతో స్నేహం చేశాడని, అత్యంత నమ్మకస్తుడిగా మెలిగాడని రవి తెలిపాడు. అందువల్లే ఎలాంటి పత్రాలు లేకుండా డబ్బులు ఇచ్చానన్నాడు. ఈ క్రమంలోనే ఆ డబ్బు తిరిగి రావాలని తన భార్య పూజలు చేసిందని, ఉపవాసాలు ఉందని చెప్పాడు. అయితే ప్రస్తుతం బిజీ షెడ్యూల్‌తో ఉన్నానని, అయినప్పటికీ కుటుంబంతోనే ఎక్కువ సమయం గడుపుతున్నానని అన్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now