మ‌హారాష్ట్ర‌లో క‌రోనా ఉగ్ర‌రూపం.. ఒకే రోజు 920 మంది మృతి..

May 5, 2021 9:42 PM

మహారాష్ట్ర‌లో క‌రోనా ఉగ్ర‌రూపం చూపిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో అక్క‌డ కొత్త‌గా 57,640 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. ఒకే రోజులో 920 మంది చ‌నిపోయారు. ఈ క్ర‌మంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య ఆ రాష్ట్రంలో 48,80,542కు చేరుకుంది. 72,662 మంది ఇప్ప‌టి వ‌ర‌కు చ‌నిపోయారు. ఏప్రిల్ 28వ తేదీ త‌రువాత ఒకే రోజు ఇంత ఎక్కువ స్థాయిలో మ‌రణించ‌డం ఇది రెండోసారి. ఆ రోజు 985 మంది చ‌నిపోయారు.

covid cases in maharashtra rising

ఇక మ‌హారాష్ట్ర‌లో గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 2,79,200 మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. 41,64,098 మంది రిక‌వ‌రీ అయ్యారు. ఒక్క రోజులో 57,006 మంది డిశ్చార్జి అయ్యారు. మంగ‌ళ‌వారం ఆ రాష్ట్రంలో 51,880 కోవిడ్ కేసులు న‌మోదు కాగా 891 మంది చ‌నిపోయారు. సోమ‌వారం 48,621 కేసులు న‌మోద‌య్యాయి. 567 మంది చ‌నిపోయారు.

మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలో బుధ‌వారం కొత్త‌గా 3,882 క‌రోనా కేసులు న‌మోదు కాగా 77 మంది చ‌నిపోయారు. ఈ క్ర‌మంలో ముంబైలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 6,65,057కు చేరుకుంది. 13,511 మంది చ‌నిపోయారు. మంగ‌ళ‌వారం ముంబైలో 2,554 కేసులు న‌మోదు కాగా, 62 మంది చ‌నిపోయారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment