Jayalalitha : ఏడేళ్ల ప్రేమ‌, నిజ‌స్వ‌రూపం తెలిసి 6 నెల‌ల‌కే బ్రేక‌ప్ చెప్పాన‌న్న జ‌య‌ల‌లిత‌..!

October 26, 2021 12:35 PM

Jayalalitha : చూడ‌డానికి చాలా చ‌క్క‌గా క‌నిపించే సీనియ‌ర్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ జ‌య‌ల‌లిత ఎక్కువ‌గా వ్యాంప్‌ పాత్రలలో క‌నిపించేది. ఆ మధ్య మహేష్‌ బాబు నటించిన `భరత్‌ అనే నేను` చిత్రంలో స్పీకర్‌గా నటించి మెప్పించింది .దాదాపుగా 700కి పైగా చిత్రాలలో నటించిన ఆమె క‌మల్ హాసన్ సరసన ‘ఇంద్రుడు చంద్రుడు’ చిత్రంలో కనిపించారు. ప్ర‌స్తుతం సినిమాల క‌న్నా సీరియ‌ల్స్‌లోనే ఆమె ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.

Jayalalitha told important things about her marriage life

ప్రస్తుతం జయలలిత `ప్రేమ ఎంత మధురం` అనే సీరియల్‌లో నటిస్తోంది. ఇందులో ఆమె ఆర్య తల్లిగా శారదాదేవి పాత్రలో తన నటనతో మెప్పిస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌ గురించి, తన మ్యారేజ్‌ లైఫ్‌ గురించి పలు షాకింగ్‌ విషయాలను వెల్లడించింది. మలయాళంలో ఇండస్ట్రీలో తాను వ్యాంప్‌ పాత్రలతోనే పరిచయం అయ్యానని తెలిపింది. తాను పెళ్లి చేసుకున్న వ్యక్తి వినోద్‌ అలాంటి సినిమాలు తీసే వ్యక్తి అని పేర్కొంది.

వినోద్‌ వాళ్ల నాన్న ప్రముఖ నిర్మాత ఆళ్లపుర పురుషన్‌. వినోద్‌ బూతు సినిమాలతోపాటు భక్తిరస చిత్రాలు కూడా తీసేవారు. అదే సమయంలో డీ గ్రేడ్‌ సినిమాలు చేసేవారు. వాటిలో తానే హీరోయిన్‌ అని చెప్పింది. మేం ఇద్దరం కలిసి ఏడేళ్లు ప్రేమించుకున్నామని, ఏడేళ్ల ప్రేమ తర్వాత నాకు డౌట్‌ వచ్చింది. పెళ్లి చేసుకుందామని చాలా ఒత్తిడి తెచ్చాను. ఆయ‌న విశ్వ‌రూపం పెళ్లి చేసుకున్నాక తెలిసింది.

కేవలం అతనికి ఉన్న అప్పులు, తన ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నాడని చెప్పుకొచ్చింది. పెళ్లి తర్వాత చిత్రహింసలు పెట్టాడని వెల్లడించింది. ప్రస్తుతం తన జీవితం హాయిగా ఉందని, ప్ర‌శాంతంగా జీవ‌నం సాగిస్తున్నాన‌ని తెలియ‌జేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment