ఐస్‌క్రీమ్ ఆర్డ‌ర్ చేస్తే.. అందులో కాళ్ల జెర్రి వ‌చ్చింది..!

June 16, 2024 12:11 PM

ఈరోజుల్లో బ‌య‌ట ఫుడ్స్‌ను అస‌లు న‌మ్మ‌లేకుండా ఉన్నాము. హోట‌ల్స్‌లో కుళ్లిపోయిన‌, ఎక్స్‌పైర్ అయిపోయిన ఫుడ్ ఐటమ్స్‌ను జ‌నాల‌కు వ‌డ్డిస్తున్నారు. అస‌లు ఏమాత్రం నాణ్య‌త‌ను పాటించ‌డం లేదు. జ‌నాల ఆరోగ్యం అంటే వ్యాపారుల‌కు లెక్క లేకుండా పోయింది. ఈ మ‌ధ్య కాలంలో మ‌నం ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌ను చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా ఇలాంటిదే మ‌రొక సంఘ‌ట‌న చోటు చేసుకుంది. కాక‌పోతే ఇది కాస్త భిన్న‌మైన విష‌యం. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందో ఒక‌సారి చూస్తే..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని నోయిడాలో ఉన్న సెక్టార్ 12 ప్రాంతానికి చెందిన దీపా దేవి త‌న 5 ఏళ్ల కుమారుడికి మ్యాంగో షేక్ త‌యారు చేయాల‌ని భావించి ఆన్‌లైన్‌లో అందుకు అవ‌స‌రం అయిన ఐస్‌క్రీమ్‌ను ఆర్డ‌ర్ చేసింది. ఓ ఈ-కామ‌ర్స్ డెలివ‌రీ యాప్‌లో ఓ కంపెనీకి చెందిన ఐస్‌క్రీమ్‌ను ఆర్డ‌ర్ చేసింది. అయితే ఐస్‌క్రీమ్ డెలివ‌రీ అయ్యాక దాని మూత తెర‌చి చూస్తే షాక‌వ‌డం దీపా దేవి వంతైంది. ఎందుకంటే ఐస్‌క్రీమ్ బాక్స్‌లో ఓ కాళ్ల జెర్రి గ‌డ్డ‌క‌ట్టుకుని పోయి క‌నిపించింది. అది ఐస్‌క్రీమ్ మీదే ఉంది.

woman ordered ice cream but it has came with centipede

దీంతో ఆమెకు వెంట‌నే వెన్నులో జ‌ల‌ద‌రింపు వ‌చ్చింది. అయితే వెంట‌నే తేరుకుని ఆ ఐస్‌క్రీమ్‌ను వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో వైర‌ల్ అయింది. అయితే ఈ సంఘ‌ట‌న‌పై ఆమె స‌ద‌రు యాప్‌లో ఫిర్యాదు చేయ‌గా వారు ఆమెకు ఆ ఐస్‌క్రీమ్ ఖ‌రీదు రూ.195 తిరిగి ఇచ్చేశారు. అలాగే స‌ద‌రు ఐస్‌క్రీమ్ కంపెనీకి సైతం తాము ఫిర్యాదు చేశామ‌ని, వారిపై అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స‌ద‌రు యాప్ వారు ఆమెకు తెలియ‌జేశారు. ఈ క్ర‌మంలో ఫుడ్ సేఫ్టీ విష‌యం మ‌రోమారు తెర‌పైకి వ‌చ్చింది. అస‌లు బ‌య‌టి ఫుడ్స్‌ను తినాలంటేనే భ‌య‌ప‌డాల్సి వ‌స్తుంద‌ని జ‌నాలంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now