అటవీ ప్రాంతాల నుంచి వెళ్లే రహదారుల్లో సహజంగానే మనకు వన్య ప్రాణులు కనిపిస్తుంటాయి. అవి రోడ్డు దాటుతుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో అవి రోడ్డు దాటుతూ వాహనదారులకు కనిపించి భయాన్ని కలగజేస్తాయి. ఈ క్రమంలోనే అలా ఓ భారీ అనకొండ పాము రోడ్డు దాటుతూ కనిపించింది. దీంతో వాహనదారులు ఆగి మరీ దాన్ని చాలా ఆసక్తిగా చూశారు.
బ్రెజిల్‌లో ఓ చోట అటవీ ప్రాంతం నుంచి వెళ్తున్న రహదారిలో ఓ 10 అడుగుల అనకొండ కనిపించింది. అది రోడ్డుకు ఒక వైపు నుంచి ఇంకో వైపుకు దాటుతోంది. దీంతో ట్రాఫిక్ కాసేపు ఆగింది. అయితే దాన్ని చూసేందుకు వాహనదారులు ఆగి మరీ దాన్ని తమ కెమెరాల్లో బంధించే ప్రయత్నం చేశారు.
రోడ్డు దాటిన ఆ అనకొండ ఇంకో వైపుకు వెళ్లిపోయింది. అయితే ఆ సమయంలో తీసిన వీడియోను ఓ యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా అది వైరల్‌గా మారింది. దానికి ఇప్పటికే లక్షలకు పైగా వ్యూస్, వేలల్లో కామెంట్లు వచ్చాయి.
సాధారణంగా అనకొండలు 250 కిలోల వరకు బరువు పెరుగుతాయి. 29 అడుగుల పొడవు వరకు పెరగగలవు. అయితే ఆ అనకొండ రోడ్డుపై కనిపించడంతో దాన్ని చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు.
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్‌లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…