గ్యాడ్జెట్స్

1.75 ఇంచుల డిస్‌ప్లే, ఎస్‌పీవో2 సెన్సార్, 60 ర‌కాల స్పోర్ట్స్ మోడ్స్‌తో.. నాయిస్ కొత్త స్మార్ట్ వాచ్‌..!

ఆడియో ఉత్పత్తులు, వియ‌ర‌బుల్స్ ను త‌యారు చేసే నాయిస్ సంస్థ తాజాగా బడ్జెట్ స్మార్ట్‌వాచ్ అయిన నాయిస్ కలర్ ఫిట్ అల్ట్రాను భారతదేశంలో విడుదల చేసింది. ఇందులో క్లౌడ్-ఆధారిత వాచ్ ఫేసెస్‌ను సెట్ చేసుకోవ‌చ్చు. 60 స్పోర్ట్స్ మోడ్స్‌, SpO2 సెన్సార్‌, 24 × 7 హార్ట్ రేట్ సెన్సార్‌, REM స్లీప్ సెన్సార్‌ల‌ను ఇందులో అందిస్తున్నారు. అలాగే స్లీప్ ట్రాకింగ్, IP68 వాటర్ ప్రూఫ్ బాడీ, 9 రోజుల బ్యాటరీ లైఫ్ ను పొంద‌వ‌చ్చు. ఈ వాచ్ 1.75 అంగుళాల పూర్తి టచ్ డిస్‌ప్లేని కలిగి ఉంది. అలాగే స్టాప్‌వాచ్, వాతావరణ సూచన, టైమర్, అలారం, ఫైండ్ మై ఫోన్ వంటి ఫీచ‌ర్లు ఈ వాచ్‌లో ల‌భిస్తున్నాయి.

నాయిస్ కలర్ ఫిట్ అల్ట్రా స్పెసిఫికేషన్లు

  • 1.75 అంగుళాల డిస్‌ప్లే, 320 x 385 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
  • 100కు పైగా క్లౌడ్ ఆధారిత వాచ్ ఫేసెస్‌, ఎల్‌సీడీ ట‌చ్‌ స్క్రీన్
  • IOS 9+ లేదా Android 5.1 + కనెక్టివిటీ, బ్లూటూత్ 5.1
  • 24 × 7 హార్ట్ రేట్‌ మానిటర్, SpO2 సెన్సార్
  • స్లీప్ మానిటరింగ్, వ్యాయామం డేటా రికార్డ్, డయల్ ఎంపిక
  • పుష్ మెసేజెస్‌, ఫోటో కంట్రోల్, వాతావరణ సమాచారం, వ్యాయామ మోడ్
  • స్టాప్‌వాచ్, కెమెరా కంట్రోల్, మ్యూజిక్ కంట్రోల్, ఫైండ్ మై ఫోన్
  • అలారం, రిమైండర్, హ్యాండ్ వాష్ రిమైండర్, రుతు చక్రం ట్రాకర్
  • స్టాక్ మార్కెట్ సమాచారం, కాల్, SMS క్విక్ రిప్లై (Android మాత్రమే)
  • 60 ర‌కాల‌కు పైగా స్పోర్ట్స్ మోడ్‌లు, నీరు, ధూళి నిరోధకత (IP68 రెసిస్టెన్స్‌)
  • 300 ఎంఏహెచ్ బ్యాటరీ, 9 రోజుల వరకు బ్యాట‌రీ బ్యాక‌ప్‌, 30 రోజుల వ‌ర‌కు స్టాండ్‌బై

నాయిస్ కలర్ ఫిట్ అల్ట్రా వాచ్‌.. స్పేస్ బ్లూ, గన్ మెటల్ గ్రే, క్లౌడ్ గ్రే రంగులలో ల‌భిస్తుంది. అమెజాన్, గోనోయిస్ సైట్ల‌లో దీన్ని రూ.5,999 ధర‌కు విక్ర‌యిస్తున్నారు. అయితే లాంచింగ్ కింద కొన్ని రోజుల వ‌ర‌కు ఈ వాచ్‌ను రూ.4,499 ధ‌ర‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM

2024 vs 2026.. ఏ వరల్డ్ కప్ విజయం గొప్పది? ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ!

భార‌త టీ20ఐ క్రికెట్ జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ…

Saturday, 14 March 2026, 8:31 PM

గ్యాస్, పెట్రోల్ కొరత రాదు.. కేంద్రం కీలక ప్రకటన! ఆ జలసంధి వద్ద టెన్షన్..

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…

Saturday, 14 March 2026, 7:22 PM

అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై మొదలైన వివాదం!

హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…

Saturday, 14 March 2026, 5:49 PM