స్మార్ట్ ఫోన్లు అనేవి నేడు మన దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. అవి ఒకప్పుడు విలాసవంతమైన వస్తువులు. కానీ నేడు నిత్యావసర వస్తువులుగా మారాయి. దీంతో ప్రతి ఒక్కరూ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. అయితే కొందరు ఫోన్ల వెనుక కేస్‌లలో కరెన్సీ నోట్లను పెట్టుకుంటారు. గమనించారు కదా. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా ? ఆ వివరాలనే ఇప్పుడు తెలుసుకుందాం.
* పర్సులు లేదా వాలెట్లలో కరెన్సీ నోట్లను పెట్టుకోవడం వల్ల లక్ కలసి వస్తుందని, అదృష్టం వరిస్తుందని నమ్మేవారు. అందుకనే కొందరు వాటిలో ఒక్క కరెన్సీ నోటును అయినా పెట్టుకుంటారు. ఇది పాత ట్రెండ్. అయితే ఇప్పుడు ఫోన్ల వెనుక కేస్‌లలో ఆ నోట్లను పెట్టుకుంటున్నారు. ఫోన్లను మనం ఎప్పుడూ వాడుతాం కదా. వ్యాపారం కోసం కూడా ఉపయోగిస్తుంటారు. అందువల్ల వాటి వెనుక కేస్‌లలో కరెన్సీ నోట్లను పెట్టుకుంటే లక్ కలసి వస్తుందని కొందరు నమ్ముతారు. అందుకనే ఆ నోట్లను వారు అలా పెట్టుకుంటారు.
* ఇక దీని వెనుక ఉన్న మరో కారణం.. పర్సు లేదా జేబులో పెట్టుకుంటే డబ్బులు పోయేందుకు అవకాశం ఉంటుంది. అలాగే వాటిపై కన్నేసి ఉంచాలి. కానీ ఫోన్‌ను ఎప్పుడూ ఉపయోగిస్తారు కదా. కనుక దాని వెనుక పెట్టుకుంటే డబ్బును మాటి మాటికీ ఉందా, లేదా అని చెక్ చేసుకోవాల్సిన పనిలేదు. అందుకనే కొందరు అలా పెట్టుకుంటారు. అక్కడ ఉండే సేఫ్‌గా ఉందని కొందరు భావిస్తారు.
* ఇక కొందరు ఎమర్జెన్సీ సమయాల్లో వాడుకునేందుకు అవసరం ఉంటాయని కూడా కరెన్సీ నోట్లను ఫోన్ల వెనుక కేస్‌లలో పెట్టుకుంటారు.
* కొందరు తమ వద్ద ఉన్న విదేశీ కరెన్సీని ఇతరులకు చూపించడం కోసం అలా నోట్లను పెట్టుకుంటారు.
ఇలా భిన్న రకాల కారణాలతో కరెన్సీ నోట్లను ఫోన్ల వెనుక కేస్‌లలో పెట్టుకుంటూ ఉంటారు. ఒకప్పుడు పర్సుల్లో నోట్లను పెట్టుకునేవారు. కానీ ఫోన్ల వల్ల ఇప్పుడు ఆ నోట్లు ఉండే ప్లేస్ మారింది. అంతే తేడా..!
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…