గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Yashoda Movie : వామ్మో.. కొద్ది రోజుల‌కే అంత రెమ్యున‌రేష‌నా..? స‌మంత డిమాండ్ మామూలుగా లేదు..!

Yashoda Movie : టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఈ బ్యూటీ నటిస్తున్న సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులో సమంత నటిస్తున్న యశోద…

Yashoda Movie : వామ్మో.. కొద్ది రోజుల‌కే అంత రెమ్యున‌రేష‌నా..? స‌మంత డిమాండ్ మామూలుగా లేదు..!

Yashoda Movie : టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఈ బ్యూటీ నటిస్తున్న సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులో సమంత నటిస్తున్న యశోద చిత్రం ఇప్పటికే ప్రేక్షకులలో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. లేడీ ఓరియెంటెడ్ కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ మూవీపై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రాన్ని శ్రీదేవీ మూవీస్ బ్యానర్ మీద శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తోండగా.. హరి – హరీష్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ టీజర్ లో సమంత గర్భవతి పాత్రలో కనిపించింది. టీజర్ లో డాక్టర్ సమంతను గర్భవతిగా ఉన్నప్పుడు ఏ ఏ పనులైతే చేయకూడదని చెప్తుందో సమంత అలాంటి పనులే చేస్తుంది. ఆమెను ఎవరో చంపడానికి ప్రయత్నించడం.. వాళ్ళ నుంచి సామ్ తప్పించుకోవడం.. విలన్స్ తో పోరాడటం ఈ టీజర్ లో చూపించారు. అసలు సమంతకు ఏమైంది.? ఆమెను ఎందుకు చంపాలని ప్రయత్నిస్తున్నారు..? అనేది ఆసక్తికరంగా ఉంది. అయితే ఈ సినిమా కోసం సమంత తీసుకున్న రెమ్యున‌రేష‌న్ కి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది.

Yashoda Movie Samantha took huge remuneration
Yashoda Movie

యశోద సినిమా కోసం సామ్ కేవ‌లం 50 రోజుల కాల్‌షీట్స్ మాత్ర‌మే ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఇలా అతి త‌క్కువ కాల్‌షీట్స్ ఇచ్చినా రెమ్యూన‌రేష‌న్ మాత్రం భారీగా తీసుకుంద‌ని తెలుస్తోంది. స‌మంత య‌శోద సినిమా కోసం దాదాపు రూ.2.75 కోట్ల రెమ్యూన‌రేషన్ తీసుకున్న‌ట్టు స‌మాచారం. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీలో ఏక‌కాలంలో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. యశోద టీజర్ తో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. త్వరలో మేకర్స్ ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి