గురువారం, జూన్ 11, 2026
ఆధ్యాత్మికం

శుక్రవారం తులసి మొక్కను ఇలా పూజిస్తే.. కష్టాలు దూరమవుతాయి..

సాధారణంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ క్రమంలోనే హిందువుల ఇంటి ఆవరణంలో తులసి మొక్క దర్శనమిస్తుంది. ఎంతో పవిత్రంగా భావించే ఈ తులసి మొక్కకు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం పూజలు…

శుక్రవారం తులసి మొక్కను ఇలా పూజిస్తే.. కష్టాలు దూరమవుతాయి..

సాధారణంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ క్రమంలోనే హిందువుల ఇంటి ఆవరణంలో తులసి మొక్క దర్శనమిస్తుంది. ఎంతో పవిత్రంగా భావించే ఈ తులసి మొక్కకు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం పూజలు చేస్తుంటారు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై కలుగుతుందని భావిస్తారు. అయితే శుక్రవారం పూట తులసి మొక్కను పచ్చి పాలతో ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Do you know what happens if the basil plant is worshiped with green milk on Friday?

వ్యాపార రంగంలో స్థిరపడిన వారు కొన్నిసార్లు వ్యాపారంలో తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ విధంగా వ్యాపారంలో అధిక నష్టాలను ఎదుర్కొనేవారు తులసి మొక్కకు శుక్రవారం సాయంత్రం పచ్చి పాలు, స్వీట్లతో పూజ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల క్రమక్రమంగా వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. ఇలా తులసి మొక్కకు నైవేద్యంగా సమర్పించిన పాలు, స్వీట్లు మిగిలితే వాటిని వివాహిత స్త్రీకి దానం చేయడం వల్ల శుభ పరిణామాలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు.

వ్యాపార రంగంలో నష్టాలు వాటిల్లకుండా ఉండాలంటే ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం తులసి మొక్కకు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. అలాగే మన ఇంట్లో ఎవరైనా సమస్యలతో సతమతమవుతున్నప్పుడు ఒక ఐదు తులసి ఆకులను ఇత్తడి నీటి కుండలో వేసి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తీసుకుని ఇంటి లోపల, బయట శుభ్రం చేసుకుంటే ఇంట్లో ఏర్పడిన సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి