గురువారం, జూన్ 11, 2026
తెలంగాణ

Mahankali Bonalu: అంద‌రినీ కాపాడుతా.. భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత..

ఉజ్జయిని మహంకాళి అమ్మ‌వారి బోనాల ఉత్స‌వాలు ఘ‌నంగా కొన‌సాగుతున్న విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే సోమ‌వారం మాతంగి స్వ‌ర్ణ‌ల‌త భవిష్యవాణి వినిపించారు. ఈ సంద‌ర్భంగా స్వ‌ర్ణ‌ల‌త భ‌విష్య వాణిని వినిపిస్తూ.. ఈ సారి భ‌క్తులు చాలా క‌ష్టాలు ప‌డ్డార‌ని,…

Mahankali Bonalu: అంద‌రినీ కాపాడుతా.. భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత..

ఉజ్జయిని మహంకాళి అమ్మ‌వారి బోనాల ఉత్స‌వాలు ఘ‌నంగా కొన‌సాగుతున్న విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే సోమ‌వారం మాతంగి స్వ‌ర్ణ‌ల‌త భవిష్యవాణి వినిపించారు. ఈ సంద‌ర్భంగా స్వ‌ర్ణ‌ల‌త భ‌విష్య వాణిని వినిపిస్తూ.. ఈ సారి భ‌క్తులు చాలా క‌ష్టాలు ప‌డ్డార‌ని, అయిన‌ప్ప‌టికీ త‌న‌కు మొక్కులు చెల్లించార‌ని అన్నారు.

will save everyday says mathangi swarna latha in rangam

భ‌క్తులంద‌రినీ తాను కాపాడుతాన‌ని, వారు సంతోషంగా ఉండే విధంగా చూస్తాన‌ని తెలిపారు. ప్ర‌జ‌లు ప‌లు స‌మ‌స్య‌ల వ‌ల్ల ఇబ్బందులు ప‌డుతుంటే రైతులు వ‌ర్షాల వ‌ల్ల స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నార‌ని, అయితే అంద‌రినీ తాను ర‌క్షిస్తాన‌ని తెలిపారు. ఎలాంటి భ‌యాందోళ‌న‌లు చెందాల్సిన ప‌నిలేద‌న్నారు. క‌రోనా భ‌య పెడుతున్నా ప్ర‌జ‌లు త‌న‌ను న‌మ్మి త‌న మొక్కులు తీర్చుకున్నందుకు సంతోషంగా ఉంద‌న్నారు.

అమ్మ‌వారికి ఇంత చేస్తున్నాం, అయినా అమ్మ‌వారు మ‌నల్ని ప‌ట్టించుకోవ‌డం లేదు.. అని ఎవ‌రూ అనుకోకూడ‌ద‌ని, అంద‌రినీ కాపాడుతాన‌ని తెలిపారు. ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తీరుస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా స్వ‌ర్ణ‌ల‌త‌కు చీర, ఒడి బియ్యం సమర్పించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి