Samantha : స‌మంత తీర్థ‌యాత్ర‌ల వెనుక సీక్రెట్ ఏంటి ?

October 26, 2021 5:19 PM

Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత.. అక్కినేని నాగ చైత‌న్య నుండి విడాకులు తీసుకున్న త‌ర్వాత వ‌రుస సినిమాలు ఒప్పుకుంటూనే షికార్లు చేస్తోంది. అయితే విడాకుల త‌ర్వాత స‌మంత ఆధ్యాత్మిక ప్రాంతాల‌కు వెళుతుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. తన స్నేహితురాలు శిల్పా రెడ్డితో కలిసి తీర్థయాత్రలకు వెళ్తుండ‌డం మ‌నం గ‌మ‌నిస్తూనే ఉన్నాం. నార్త్ ఇండియాలోని ప్రతిష్టాత్మక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తోంది సమంత.

what is the reason behind Samantha tours

ఇలా తీర్థ‌యాత్ర‌ల‌కు వెళ్ల‌డం వెన‌క‌ అంతారార్థమేంటో అంటూ.. అంతా ఆరా తీస్తున్నారు. దీనికి పెద్ద‌గా కార‌ణాలేవి లేవు కానీ, ప్రాణంగా ప్రేమించిన నాగ చైతన్య దూరం కావడంతో చాలా డిస్టర్బ్ అయిన సామ్.. మానసిక ప్రశాంతత కోసమే ఇలా తీర్థ యాత్రలకు వెళ్లిందని వార్తలు వినిపిస్తున్నాయి. పాత జ్ఞాప‌కాల నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక మ‌ళ్లీ త‌న సినిమా షూటింగ్స్‌తో బిజీ కానుంద‌ని అంటున్నారు.

ప్రస్తుతం స‌మంత‌ తెలుగులో గుణశేఖర్ శాకుంతలంతోపాటు సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించబోయే సినిమాకు సైన్ చేసింది. అలాగే తమిళంలో విఘ్నేష్ శివన్ సినిమాతోపాటు డ్రీమ్ వారియర్స్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప‌లు బాలీవుడ్ ప్రాజెక్టుల‌కు కూడా ఈ అమ్మ‌డు ప‌ని చేస్తుంద‌నే టాక్ వినిపిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment