గురువారం, జూన్ 11, 2026
వినోదం

Veera Simha Reddy : అఫీషియ‌ల్‌.. బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డి మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ .. ఎప్ప‌టి నుండి అంటే..?

Veera Simha Reddy : నందమూరి నటసింహం బాలయ్య అఖండ త‌ర్వాత గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ‘వీరసింహారెడ్డి’ అనే సినిమా చేసిన విష‌యం తెలిసిందే. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ఈ సినిమా విడుదల అయ్యింది. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి…

Veera Simha Reddy : అఫీషియ‌ల్‌.. బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డి మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ .. ఎప్ప‌టి నుండి అంటే..?

Veera Simha Reddy : నందమూరి నటసింహం బాలయ్య అఖండ త‌ర్వాత గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ‘వీరసింహారెడ్డి’ అనే సినిమా చేసిన విష‌యం తెలిసిందే. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ఈ సినిమా విడుదల అయ్యింది. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ఫ్యాక్ష‌నిజం, యాక్ష‌న్ ను జత చేసి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. వీర‌సింహారెడ్డి అనే రాయ‌ల‌సీమ నాయకుడిగా, జై అనే యువ‌కుడిగా నటించి ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నాడు.. వెండి తెరపై దుమ్మురేపిన ఈ సినిమా ఇకపై ఓటీటీలోనూ సందడి చేయబోతున్నది.

వీరసింహారెడ్డి సినిమా ఓటీటీ హక్కులు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకుంది. ఫిబ్రవరి 23వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి ఈ సినిమా డిస్నీ పల్స్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని మేక‌ర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ అప్ డేట్ చూడగానే బాలయ్య అభిమానులు మాత్రమే కాదు.. తెలుగు ప్రేక్షకులు అంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఎప్పుడెడ్డుపా అని ఎదురుచూసిన సినిమా ఓటీటీలోకి వస్తోందని తెలిసి తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లో మిస్ అయిన వాళ్లు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఆస‌క్తిగా చూస్తూ వ‌స్తున్నారు.

Veera Simha Reddy movie to stream on OTT know the app
Veera Simha Reddy

వీర‌సింహారెడ్డి సినిమా ప్ర‌పంచ‌ వ్యాప్తంగా రూ. 130 కోట్లకు పైగా వసూళు చేసింది. బాల‌య్య కెరీర్ లోనే అత్యధిక వసూళు చేసిన సినిమాగా నిలిచింది. బాలకృష్ణ కెరీర్ లో 107వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. హనీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, కన్నడ స్టార్ దునియా విజయ్, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు సహా పలువురు ఈ సినిమాలో నటించారు. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌ కుమార్ ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్ లో కనిపించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి