Heroines : ఫిల్మ్ ఇండస్ట్రీలో చదువుతో పెద్దగా సంబంధం ఉండదు. అందం, అభినయం ఉంటే స్టార్ హీరోయిన్ గా రాణించొచ్చు. కానీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కేవలం అందంలోనే కాదు చదువులోనూ తామేం తక్కువ కాదు అని నిరూపించుకున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు చదువు పూర్తి చేశారు. అంతే కాకుండా కొందరు భామలు ఉన్నత చదువులు చదవడం విశేషం. ఇక టాలీవుడ్ లో ఏ హీరోయిన్ ఏం చదువుకుంది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
క్వాలిఫికేషన్ గురించి చెప్పుకునే ముందుగా సాయి పల్లవి గురించి చెప్పాలి. నెమలిలా నాట్యం చేసే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. కేవలం నటన నాట్యం లోనే కాదు చదువులోనూ సాయి పల్లవి చాలా చురుకు. ఈ భామ ఎంబీబీఎస్ పూర్తి చేసింది. కమల్ హాసన్ ముద్దుల కూతురు శృతి హాసన్ తన అందం తో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. ఈ ముద్దుగుమ్మ బీఎస్సీ సైకాలజీ చదువుకుంది. సమంత గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లోని టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ బీ కామ్ డిగ్రీని పూర్తి చేసింది.
ఛలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన జర్నలిజం, సైకాలజీలలో డిగ్రీ పూర్తి చేసింది. ఇక బుట్ట బొమ్మ పూజ హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉంది. పూజ హెగ్డే ఎం కామ్ చదువుకుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం అటు తమిళ్ ఇటు తెలుగు లో ఫుల్ బిజీగా ఉంది. నయనతార బిఏ లిటరేచర్ చదువుకుంది.
అందాల చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుని ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ముద్దుగుమ్మ బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియాలో పట్టా అందుకుంది. సూపర్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అనుష్క ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అనుష్క కార్మెల్ కాలేజ్ లో కంప్యూటర్ అప్లికేషన్స్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసింది. టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా ఆర్ట్స్ లో డిగ్రీ పూర్తి చేసింది. ప్రస్తుతం తమన్నా మెగాస్టార్ తో భోళా శంకర్ లో నటిస్తోంది. నేను శైలజతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది కీర్తి సురేష్. మహానటి చిత్రంతో జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. కీర్తి కేరళలోని ప్లర్ అకాడమీలో ఫ్యాషన్ డిజైన్ లో డిగ్రీ పూర్తి చేసింది.
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి…